సామర్లకోటలో పోలీసు గ్రీవెన్స్‌

ABN , First Publish Date - 2023-09-20T00:33:06+05:30 IST

సామర్లకోట, సెప్టెంబరు 19: సామర్లకోట పోలీస్టేషన్‌ ఆవరణలో సోమవారం జిల్లా ఎస్పీ సతీష్‌కుమార్‌ పోలీసు పరిష్కార వేదిక పేరిట గ్రీవెన్స్‌ నిర్వహించారు. ఈ గ్రీవెన్స్‌పై ముందస్తు ప్రచారం చేపట్టకపోవడం, వినాయక చవితి పం డగ రోజు కావడంతో అర్జీలు అందించేందుకు ప్రజలు ఆసక్తి కనబర్చలేకపోయారు. మండలవ్యాప్తంగా 18 గ్రామాల నుం చి కేవలం 36 ఫిర్యాదులు అందాయి. సామర్లకోట సీబీఎం సెంటర్లో నిత్యం బస్సుల కోసం

సామర్లకోటలో పోలీసు గ్రీవెన్స్‌

సామర్లకోట, సెప్టెంబరు 19: సామర్లకోట పోలీస్టేషన్‌ ఆవరణలో సోమవారం జిల్లా ఎస్పీ సతీష్‌కుమార్‌ పోలీసు పరిష్కార వేదిక పేరిట గ్రీవెన్స్‌ నిర్వహించారు. ఈ గ్రీవెన్స్‌పై ముందస్తు ప్రచారం చేపట్టకపోవడం, వినాయక చవితి పం డగ రోజు కావడంతో అర్జీలు అందించేందుకు ప్రజలు ఆసక్తి కనబర్చలేకపోయారు. మండలవ్యాప్తంగా 18 గ్రామాల నుం చి కేవలం 36 ఫిర్యాదులు అందాయి. సామర్లకోట సీబీఎం సెంటర్లో నిత్యం బస్సుల కోసం వేచి ఉండే విద్యార్థినుల పట్ల పలువురు ఆకతాయి యువత వేధింపులకు పాల్పడు తున్నారని జిల్లా మానవహక్కుల పరిరక్షణ సంఘ అధ్యక్ష, కార్యదర్శులు నూతలపాటి అప్పలకొండ, కుంచే నానిబాబు ఎస్పీకి ఫిర్యాదు చేశారు. అలాగే రాత్రి వేళల్లో పోలీసులు గస్తీ తిరగకపోవడం వల్ల నిత్యం చోరీలు పెరిగాయన్నారు.

Updated Date - 2023-09-20T00:33:06+05:30 IST