ఎంపీ నుంచి ప్రాణహాని ఉంది..
ABN , First Publish Date - 2023-05-27T01:07:32+05:30 IST
ఎంపీ భరత్‌రామ్ ప్రధాన అనుచరుల నుంచి బెదిరింపులు వస్తు న్నాయని.. తనకు, తన కుటుంబానికి ప్రాణహాని ఉందని జిల్లా ఎస్పీ సుధీర్‌కుమార్‌రెడ్డికి బీసీ సంక్షేమ సంఘం జాతీయ కార్యదర్శి, బీజేపీ నాయకురాలు నర్సిపల్లి హారిక ఫిర్యాదు చేశారు.

రాజహేంద్రవరం, మే 26(ఆంధ్రజ్యోతి): ఎంపీ భరత్‌రామ్ ప్రధాన అనుచరుల నుంచి బెదిరింపులు వస్తు న్నాయని.. తనకు, తన కుటుంబానికి ప్రాణహాని ఉందని జిల్లా ఎస్పీ సుధీర్‌కుమార్‌రెడ్డికి బీసీ సంక్షేమ సంఘం జాతీయ కార్యదర్శి, బీజేపీ నాయకురాలు నర్సిపల్లి హారిక ఫిర్యాదు చేశారు. ఎంపీ భరత్‌రామ్ పుట్టినరోజున దెందు లూరు వద్ద జరిగిన ప్రమాదానికి సంబంధించి బాధిత కుటుంబానికి అండగా నిలుస్తూ తన ఫేస్‌బుక్ ఐడీ నుంచి ఒక పోస్టింగ్ పెట్టానన్నారు. అలాగే సీసీ పుటేజీ బయటకు రాకపోవడం, కేసులో జాప్యం జరగడంపై 17న మరో పోస్టింగ్ పెట్టానని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఫేక్ ఐడీలతో తన వ్యక్తిగత జీవితాన్ని ఇబ్బంది పెడుతూ, పోస్టింగులు పెడుతున్నారన్నారు. గతంలో కూడా వైసీపీ ఆవిర్భవించిన కొత్తలో తన కారుపై కొందరు దుండ గులు పెట్రోలు పోసి నిప్పుపెట్టారని,ఇప్పుడు తమ ప్రాణా లకే ముప్పు తలపెట్టే విధంగా బెదిరిస్తున్నారని తెలిపారు. ఫిర్యాదుతోపాటుఆధారాలు ఎస్పీకి సమర్పించానన్నారు.
ఎస్పీకి జనసేన నాయకుల ఫిర్యాదు
రాజమహేంద్రవరం అర్బన్, మే 26 : జనసేన ఫేస్‌బుక్ (జై జనసేన, జై పవన్) పేరుతో ఫేక్ ఐడీ సృష్టించి మహిళలను కించపరుస్తూ వ్యక్తిగతంగా దూషణలకు పాల్పడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని జనసేన పార్టీ రాజమహేంద్రవరం సిటీ ఇన్‌చార్జి అనుశ్రీ సత్యనారాయణ శుక్రవారం జిల్లా పోలీస్ సూపరింటెండెంట్‌కు ఫిర్యాదు చేశారు. కొందరు ఆకతాయిలు పార్టీ ప్రతిష్టను దిగజార్చుతూ ఇలాంటి పనులు చేస్తున్నారని, ఇవి పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. పార్టీ ఉపాధ్యక్షుడు గుత్తుల సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శి పైడిరాజు, సిటీ కార్యదర్శి గుణ్ణం శ్యాంసుందర్ పాల్గొన్నారు.