పోలవరం ప్రాజెక్టుతోనే వరద ముంపు

ABN , First Publish Date - 2023-07-21T00:55:59+05:30 IST

పోలవరం ప్రాజెక్టు నిర్మాణం విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు త్రీవ నిర్లక్ష్యం వ్యహిస్తున్నాయని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు అన్నారు. రాజమహేంద్రవరం ప్రెస్‌క్లబ్‌లో గురువారం విలేకరులతో మాట్లాడారు.

పోలవరం ప్రాజెక్టుతోనే వరద ముంపు

  • ఆగస్టు 7న ఢిల్లీలో ధర్నా.. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు

రాజమహేంద్రవరం అర్బన్‌, జూలై 20 : పోలవరం ప్రాజెక్టు నిర్మాణం విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు త్రీవ నిర్లక్ష్యం వ్యహిస్తున్నాయని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు అన్నారు. రాజమహేంద్రవరం ప్రెస్‌క్లబ్‌లో గురువారం విలేకరులతో మాట్లాడారు. ప్రస్తుతం గోదావరికి వస్తున్న వరదలపై రాష్ట్ర ప్రభుత్వం ముందస్తు సహాయక చర్యలు చేపట్టాలన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం వల్లనే నిర్వాసిత గ్రామాల్లోకి వరద ముంపు వస్తున్నదన్నారు. పోలవరం నిర్వాసితులకు న్యాయం చేయాలనే డిమాండ్‌తో ఆగస్టు 7వ తేదీన ఢిల్లీలో ధర్నా నిర్వహించనున్నామన్నారు. ప్రధానంగా పోలవరం ముంపు ప్రాంతాల్లోని నిర్వాసితులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏమాత్రం పట్టించుకోవడంలేదని విమర్శించారు. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంపై ఒత్తిడి తెచ్చి నిర్వాసితులకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు. పీడీఎఫ్‌ ఎమ్మెల్సీ కేఎస్‌ లక్ష్మణరావు మాట్లాడుతూ విభజన చట్టంలోని సెక్షన్‌ 90 ప్రకారం పోలవరం ప్రాజెక్టు, పునరావాసం, పర్యావరణ అంశం కేంద్ర ప్రభుత్వానిదే పూర్తి బాధ్యత అని స్పష్టం చేశారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వి.వెంకటేశ్వర్లు మాట్లాడారు. సీపీఎం జిల్లా కార్యదర్శి టి.అరుణ్‌, నగర కార్యదర్శి బి.పవన్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-07-21T00:55:59+05:30 IST