Share News

పోలవరం కుడి కాల్వలో యువకుడి మృతదేహం

ABN , First Publish Date - 2023-12-02T00:07:15+05:30 IST

మండలంలోని అచ్చన్నపాలెంలో పోలవరం కుడి కాల్వలో యువకుడి మృతదేహం లభ్యమైనట్టు ఎస్‌ఐ నరసింహమూర్తి తెలిపారు.

పోలవరం కుడి కాల్వలో యువకుడి మృతదేహం

నల్లజర్ల, డిసెంబరు 1: మండలంలోని అచ్చన్నపాలెంలో పోలవరం కుడి కాల్వలో యువకుడి మృతదేహం లభ్యమైనట్టు ఎస్‌ఐ నరసింహమూర్తి తెలిపారు. మృతదేహాన్ని చేపలు తినివేసి కాల్వ నీటిపై కనిపించడంతో స్థానికులు శుక్రవారం పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని కాల్వ నుంచి బయటకు తీయించి.. మృతుడి వివరాలు ఆరా తీశారు. కాగా అనంతపల్లికి చెందిన కెల్లా రాజేష్‌(26) అదృశ్యంపై ఫిర్యాదు చేయడంతో అతడి తల్లిదండ్రులను పిలిపించారు. అతడు వేసుకున్న దుస్తుల ఆధారంగా మృతుడు తమ కుమారుడేనని నిర్ధారించడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రాజేష్‌ ఇంటర్‌ వరకు చదువుకుని దురలవాట్లకు బానిసై గారడిగా తిరుగుతుండేవాడని గ్రామస్థులు చెబుతున్నారు.

Updated Date - 2023-12-02T00:07:17+05:30 IST