పొగాకు అధరహో..
ABN , First Publish Date - 2023-06-25T00:08:14+05:30 IST
పొగాకు ధరలు రోజురోజు రికార్డు స్థాయిలో పెరుగు తున్నాయి.దేవరపల్లి వేలం కేంద్రంలో ఆదివారం కిలో పొగాకు ధర రూ.287 పలికింది.
రైతుల ఆనందం
దేవరపల్లి, జూన్ 24 : పొగాకు ధరలు రోజురోజు రికార్డు స్థాయిలో పెరుగు తున్నాయి.దేవరపల్లి వేలం కేంద్రంలో ఆదివారం కిలో పొగాకు ధర రూ.287 పలికింది. అంతర్జాతీయ మార్కెట్‌లో వర్జీనియా పొగాకుకు డిమాండ్ ఏర్పడింది. దీంతో కంపెనీలు పొగాకు కొనుగోలుకు పోటీ పడుతున్నాయి.ధరలు రికార్డు స్థాయిలో పెరుగుతున్నాయి. అంతర్జాతీయంగా జింబాబ్వే, బ్రెజిల్ వంటి దేశాల్లో దిగుబడి తగ్గడంతో మన ప్రాంతంలో ఎన్‌ఎల్‌ఎస్ పొగాకుకు డిమాండ్ ఏర్పడిం ది.మరో నాలుగైదు రోజుల్లో కిలో రూ.300 మార్కు దాటే అవకాశం ఉందని పలువురు చెబుతున్నారు. రైతుల వద్ద సగానికి పైగా ఇంకా అమ్మకానికి ఉంది. ప్రతి బేలు కిలో రూ.287 కొనుగోలు ధర పెరగడం రైతుల్లో ఆనందం నెలకొంది. గత రెండేళ్ల కిందట పొగాకు సాగు చేయాలంటేనే భయపడే రైతులు ఈ ఏడాది ధరలు చూసి పొగాకు సాగు చేయడానికి సానుకూలంగా ఉన్నారు.