పొగాకుపై పగ

ABN , First Publish Date - 2023-03-20T01:28:17+05:30 IST

బ్యారన్‌ పొగాకు ఎన్‌ఎల్‌ఎక్స్‌ రకం పండించాలంటే రైతులు ఎంతో కష్టపడాల్సి వస్తోంది.

పొగాకుపై పగ
రామాయంపాలెంలో ఆరబెట్టిన పొగాకు

బ్యారన్‌ పొగాకుకు బోర్డు మద్దతు ధర కల్పించాలి

గత సంవత్సరం కంటే అధిక పెట్టుబడులు

క్వింటా రూ.26 వేలు పలికితేనే గట్టెక్కేది

నష్టాలు తప్పేటట్టు లేదని రైతుల ఆందోళన

గండేపల్లి, మార్చి 19:బ్యారన్‌ పొగాకు ఎన్‌ఎల్‌ఎక్స్‌ రకం పండించాలంటే రైతులు ఎంతో కష్టపడాల్సి వస్తోంది. ఈ బేరన్‌ పొగాకు ఈ సంవత్సరం టుబాకో బోర్డు క్వింటాకు రూ.26వేలు గిట్టుబాటు ధర కల్పించి కొనుగోలు చేయకపోతే నష్టాలు తప్పేటట్లు లేవని రైతులు ఆందోళన చెందుతున్నారు. అయితే గత సంవత్సరం క్విం టా రూ.18వేలు వరకు రేటు పలికిందని అయితే ఈ సంవత్సరం ఎకరానికి లక్ష రూపాయలు పెట్టుబడి మాత్రమే పెట్టామని, అ యితే ఎస్‌వోబీ పటాస్‌ బస్తా రూ.2800, కాల్షియం గ్రోమోర్‌ బస్తా రూ.2500లు, పుల్లలు టన్ను రూ.2వేలు ధర తక్కువగా ఉండేవని అయితే ఈ సంవత్సరం ధరలు అన్నీ రెట్టింపు అయ్యాయని, బస్తా పటాస్‌ రూ.4900, కాల్షియం గ్రోమోర్‌ రూ.5100, పుల్లలు రూ.2వే లు నుంచి 3500 వరకు ఉంది. సాగుకు కావాల్సిన అన్ని మందు లు, ఎరువులు అధిక ధరలుకావడంతో గత సంవత్సరం ఎకరానికి రూ.1.20లక్షలు పెట్టుబడి అయితే, ఈ సంవత్సరం మరో రూ.60వే లు అదనంగా పెట్టుబడులు భారంగా మారాయని రైతులు అంటున్నారు. ఈ సంవత్సరం క్వింటా రూ.28 వేలు ఇవ్వకపోతే నష్టాల నుంచి గట్టెక్కలేమని పొగాకు రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇదిలావుంటే తెగుళ్లు కూడా భారీగా పెరిగాయని వైర్‌స తెగులుతో దిగుబడులు పూర్తిగా లోపించాయని రైతులు చెబుతున్నారు. గత సంవత్సరం 10 నుంచి 15 టన్నులు దిగుబడి వచ్చిందని, కానీ ఈ సంవత్సరం వైర్‌స తెగులు సోకి ఆకు ముడత పడి 8నుంచి 10 క్వింటాళ్ల వరకు దిగుబడి వస్తోందని, పెట్టిన పెట్టుబడులు చూస్తే దిగుబడులు ఏ మాత్రం సరిపోవడంలేదని రైతులు అంటున్నారు. వీటిని దృష్టిలో పెట్టుకుని బోర్డు రైతులకు ఈ సంవత్సరం ఎక్కువ మద్దతు కల్పించడానికి చర్యలు తీసుకోవాలని వా రు వేడుకుంటున్నారు. ఈ బేరన్‌ పొగాకు సాగుచేయాలంటే కష్టంతో కూడుకున్న పని అని. పొగాకు ఆకులు తోరణాలు మలిచి బేరన్‌లో వాటిని తోరణాలుగా కట్టి వారంరోజులపాటు వాటిని పుల్లలతో వేడిచేసి వాటిని బేళ్లుగా అమర్చి మార్కెట్‌కు తరలించాల్సి ఉంటు ందని రైతులు అంటున్నారు. అలాగే పంట నారు వేసినప్పటి నుంచి కంటికి రెప్పలా కాపాడుకోవాలని రెండు సంవత్సరాల నుంచి పెద్దగా లాభాలు రావడంలేదని రైతులు చెబుతున్నారు. పండించిన పంటను దేవరపల్లి టుబాకా బోర్డుకు తరలిస్తామని అక్కడే క్వాలిటీని బట్టి రేటు కడతారన్నారు. మండలంలో మురారి, సింగరాయపాలెం, రామా యంపాలెం, సుబ్బయమ్మపేట, గండేపల్లి తదితర చోట్ల సుమారు 700 ఎకరాల్లో ఈ పొగాకు సాగు చేస్తున్నారు.

50 ఎకరాల్లో పొగాకు సాగు చేస్తున్నా

-చెలగళ్ల రాజు దొర, మురారి

బేరన్‌ పొగాకు సాగు 50 ఎకరాల్లో ఎన్నో సంవత్సరాలుగా సాగుచేస్తున్నా ను. గత రెండు సంవత్సరాల నుంచి లా భాలు పెద్దగా లేవు. ఈ సంవత ్సరం అయినా లాభాలు వస్తాయనుకుంటే పెరిగిన ఎరువులు, మందుల ధరలు, పుల్లలతో డబల్‌ పెట్టుబడి అయింది. బోర్డు స్పందించి గిట్టుబాటు ధర కల్పించాలి.

క్వింటాకు రూ.26వేలు ఇవ్వాలి

-గద్దేసత్తిబాబు, మురారి

గత సంవత్సరం చూసుకుంటే క్వింటా రూ.15వేలు నుంచి రూ.18వేలు ధర పలికింది.అప్పుడు ఎరువులు తక్కువ ధరకు లభించాయి.ప్రస్తుతం ఎరువులు, లేబర్‌చార్జీ లు ఎక్కువయ్యాయి. వైరస్‌ సోకి దిగుబడులు కూడా తగ్గిపోయాయి. క్వింటా రూ.26 వేలు మద్దతు ధర కల్పించకపోతే నష్టాలే.

Updated Date - 2023-03-20T01:28:17+05:30 IST