అన్నదాతలను ఆదుకోవడమే లక్ష్యం

ABN , First Publish Date - 2023-06-18T23:37:40+05:30 IST

రమణక్కపేట (కొత్తపల్లి), జూన్‌ 18: కష్టాల్లో ఉన్న అన్నదాతలను ఆదుకోవడమే టీడీపీ లక్ష్యమని రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎ్‌సఎన్‌ వర్మ అన్నారు. ఆదివారం రమణక్కపేటలో ఆయన పర్యటించి రైతుల సమస్యలపై తీశారు. తమ పొలాల్లోకి వెళ్లేందుకు దారి లేదని పలువురు రైతులు వాపోయారు. రమణక్కపేట లో సుమారు 300 ఎకరాలు కలిగిన పొలాలకు వెళ్లేందుకు దారిలేదని దీంతో రైతులు ఒక్కొక్కరు రూ.35వేల చొప్పున అప్పులుచేసి చందాలు వేసుకొని 2కిలోమీటర్ల దారి నిర్మించుకోవడం వైసీపీ కి సిగ్గుచేటని వర్మ పేర్కొన్నారు. నియోజకవర్గం లో చెరువుల్లో మట్టిని పేదల ఇళ్ల స్థలాలకని చె ప్పి అ

అన్నదాతలను ఆదుకోవడమే లక్ష్యం
రూ.50వేల నగదును అందజేస్తున్న వర్మ

టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వర్మ

రమణక్కపేట (కొత్తపల్లి), జూన్‌ 18: కష్టాల్లో ఉన్న అన్నదాతలను ఆదుకోవడమే టీడీపీ లక్ష్యమని రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎ్‌సఎన్‌ వర్మ అన్నారు. ఆదివారం రమణక్కపేటలో ఆయన పర్యటించి రైతుల సమస్యలపై తీశారు. తమ పొలాల్లోకి వెళ్లేందుకు దారి లేదని పలువురు రైతులు వాపోయారు. రమణక్కపేట లో సుమారు 300 ఎకరాలు కలిగిన పొలాలకు వెళ్లేందుకు దారిలేదని దీంతో రైతులు ఒక్కొక్కరు రూ.35వేల చొప్పున అప్పులుచేసి చందాలు వేసుకొని 2కిలోమీటర్ల దారి నిర్మించుకోవడం వైసీపీ కి సిగ్గుచేటని వర్మ పేర్కొన్నారు. నియోజకవర్గం లో చెరువుల్లో మట్టిని పేదల ఇళ్ల స్థలాలకని చె ప్పి అమ్ముకుంటున్నారని ఆరోపించారు. రైతుల పొలాలకు రోడ్డు వేయించలేనని అధికార పార్టీ ఎమ్మెల్యే చెబితే టీడీపీ కార్యకర్తలందరూ చందాలువేసుకొని పొలాల్లోకి దారి నిర్మిస్తారని వర్మ తెలిపారు. ఈ గ్రామాల్లో పొలాలు ముంపునకు గురికాకుండా ఉండేందుకు రైతుల శ్రేయస్సు కోసం టీడీపీ ప్రభుత్వ హయాంలో ఏలేరు ఆధునికీకరణ పనులు మంజూరు చేసి శంకుస్థాపన చేసినట్టు తెలిపారు. ప్రస్తుత ఎమ్మెల్యే, ఎంపీ సిఫారసుతో ఆ పనులు నిలిపివేసి రైతులకు తీర ని అన్యాయం చేశారన్నారు. రైతుల పొలాల్లోకి వెళ్లే దారికి నిధులు మంజూరునకు ఎమ్మె ల్యే చ ర్యలు చేపట్టాలని వర్మ డిమాండ్‌ చేశారు. రమణక్కపేటలో పొలాల్లోకి దారి నిర్మాణం కోసం రూ.50వేల నగదును రైతులకు అందజేశారు.

Updated Date - 2023-06-18T23:37:40+05:30 IST