Share News

కార్తీక వనసమారాధనకు తరలిరావాలి

ABN , First Publish Date - 2023-11-14T00:38:00+05:30 IST

పిఠాపురం, నవంబరు 13: పిఠాపురం పట్టణ శివారు నరసింగపురం రోడ్డులో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో కులమతాలకతీతంగా ఈనెల 19న నిర్వహించే కార్తీక వనసమారాధనకు ప్రజలంతా తరలిరావాలని మాజీ ఎమ్మెల్యే, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఎస్వీఎస్‌ఎన్‌ వర్మ కోరారు. కార్తీక వనసమారాధన నిర్వహించే

కార్తీక వనసమారాధనకు తరలిరావాలి
కార్తీక వనసమారాధన నిర్వహించే ప్రాంతాన్ని పరిశీలిస్తున్న వర్మ

పిఠాపురం, నవంబరు 13: పిఠాపురం పట్టణ శివారు నరసింగపురం రోడ్డులో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో కులమతాలకతీతంగా ఈనెల 19న నిర్వహించే కార్తీక వనసమారాధనకు ప్రజలంతా తరలిరావాలని మాజీ ఎమ్మెల్యే, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఎస్వీఎస్‌ఎన్‌ వర్మ కోరారు. కార్తీక వనసమారాధన నిర్వహించే పట్టణ శివారులోని మామిడితోటలను ఆయన సోమవారం పరిశీలించారు. నియోజకవర్గంలోని టీడీపీ కుటుంబసభ్యులంతా ఇందులో పాల్గొనాలన్నారు. అయ్యప్పస్వాములు, మహిళలకు ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశా మన్నారు. టీడీపీ జిల్లా ఆర్గనైజింగ్‌ కార్యదర్శి కొండేపూడి సూర్యప్రకాష్‌, దేవరపల్లి రామారావు, సోము సత్యనారాయణ, బర్ల అప్పారావు, నామా దొరబాబు, అల్లరవపు నగేష్‌, రాయుడు శ్రీను, అడ్డూరి శ్రీనివాస్‌, గొడుగుల సూరిబాబు తదితరులున్నారు.

Updated Date - 2023-11-14T00:38:01+05:30 IST