ఉపాధి కూలీ వేతనాల్లో వ్యత్యాసాలను సరిచేయాలి

ABN , First Publish Date - 2023-06-09T00:27:06+05:30 IST

కొమరగిరి (కొత్తపల్లి), జూన్‌ 8: ఉపాధి కూలీలకు చెల్లించే వేతనాల చెల్లింపుల్లో వ్యత్యాసాలను సరిచేయాలని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎ్‌సఎన్‌ వర్మ ఉన్నతాధికారులను కోరారు. కొమరగిరి గ్రామంలో గురువారం పర్యటించిన ఆయన పనులు చేస్తున్న ఉపాఽధి కూలీలతో వేతనాల విషయంపై చర్చించారు. రోజుకు తమ కు కేవలం రూ.220 వేతనం చెల్లిస్తున్నారని వారు తెలపగా దీనిపై స్పందించిన వర్మ కాకినాడ రూరల్‌, పిఠాపురం,

ఉపాధి కూలీ వేతనాల్లో వ్యత్యాసాలను సరిచేయాలి
కొమరగిరిలో ఉపాధి కూలీలతో మాట్లాడుతున్న వర్మ

టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వర్మ

కొమరగిరి (కొత్తపల్లి), జూన్‌ 8: ఉపాధి కూలీలకు చెల్లించే వేతనాల చెల్లింపుల్లో వ్యత్యాసాలను సరిచేయాలని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎ్‌సఎన్‌ వర్మ ఉన్నతాధికారులను కోరారు. కొమరగిరి గ్రామంలో గురువారం పర్యటించిన ఆయన పనులు చేస్తున్న ఉపాఽధి కూలీలతో వేతనాల విషయంపై చర్చించారు. రోజుకు తమ కు కేవలం రూ.220 వేతనం చెల్లిస్తున్నారని వారు తెలపగా దీనిపై స్పందించిన వర్మ కాకినాడ రూరల్‌, పిఠాపురం, గొల్లప్రోలు మండలాల్లో ఉపాధి కూలీలకు రోజుకు రూ.270 వేతనం చెల్లిస్తుండగా కొమరగిరిలో రూ.220 చెల్లించడంపై ఉపాఽధి పీడీతో ఫోన్‌లో మాట్లాడారు. ఎండలో కష్టపడి పనిచేసే కూలీలకు సమీప మండలాల్లో ఉపాధికూలీలతో పాటు వేతనం చెల్లించాలని కోరారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో కూలీలకు టెంట్‌లు ఏర్పాటు చేసి మజ్జిగ, టోపీలు పంపిణీ చేసేవారమన్నారు. అన్ని మండలాల్లో మాదిరిగా మండల కూలీలకు రూ.270 వేతనం చెల్లించాలని డిమాండ్‌ చేశారు.

Updated Date - 2023-06-09T00:27:06+05:30 IST