మహిళలకు గౌరవం తీసుకొచ్చిన ఎన్టీఆర్‌

ABN , First Publish Date - 2023-03-09T00:34:44+05:30 IST

మహిళలకు ఆస్తిలో వాటా కల్పించిన ఘనత టీడీపీ ప్రభుత్వానిదేనని రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీ ఎమ్మెల్యే ఎస్‌వీఎ స్‌ఎన్‌ వర్మ అన్నారు. పిఠాపురం టీడీపీ కార్యాలయంలో బుధవారం మహిళ దినోత్సవాన్ని ఘన ంగా నిర్వహించారు. తొలుత ఎన్టీఆర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి అనంతరం కేక్‌ కట్‌ చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు ని ర్వహించిన జూమ్‌ సమావేశంలో మహిళ నాయకులు పాల్గొ

మహిళలకు గౌరవం తీసుకొచ్చిన ఎన్టీఆర్‌
పిఠాపురంలో దుస్తులు పంపిణీ చేస్తున్న వర్మ

టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వర్మ

పిఠాపురం, మార్చి 8: మహిళలకు ఆస్తిలో వాటా కల్పించిన ఘనత టీడీపీ ప్రభుత్వానిదేనని రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీ ఎమ్మెల్యే ఎస్‌వీఎ స్‌ఎన్‌ వర్మ అన్నారు. పిఠాపురం టీడీపీ కార్యాలయంలో బుధవారం మహిళ దినోత్సవాన్ని ఘన ంగా నిర్వహించారు. తొలుత ఎన్టీఆర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి అనంతరం కేక్‌ కట్‌ చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు ని ర్వహించిన జూమ్‌ సమావేశంలో మహిళ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వర్మ మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో మహిళలకు గౌరవం తీసుకొచ్చిన ఘనత ఎన్టీఆర్‌దేనన్నారు. మహిళ సాధికారిత ఒక్క టీడీపీతోనే సాధ్యమన్నారు. మొదటిసారిగా డ్వాక్రా సంఘాలు పెట్టింది, మహిళలకు రిజర్వేషన్లు కల్పించింది చంద్రబాబే అన్నారు. వైసీపీ ప్రభుత్వంలో మహిళలకు ఇంటిని నడపలేని పరిస్థితులో ఉన్నారని, నిత్యావసరాలు, వంటగ్యాస్‌ ధరల పెంపుతో సతమతం అవుతున్నారన్నారు. అనంతరం మహిళల నాయకులకు దుస్తులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో నియోజకవర్గ మహిళ అధ్యక్షురాలు పంపనబోయిన అన్నపూర్ణ, కౌన్సిలర్‌ నల్లా రవణమ్మ, దుర్గాడ విజయలక్ష్మీ, ముత్యాల దివ్య, పీతల అమ్మాజీ, మాతా మాధవి, రాయుడు సత్యవేణి, ఉప్పు రమ్య దేవి, బంగారు ద్వారక, బోడపాటి ప్రమీల, సూర్నీడి లక్ష్మీ పాల్గొన్నారు.

Updated Date - 2023-03-09T00:34:44+05:30 IST