‘టిడ్కో ఇళ్లు అప్పగించే వరకూ ఉద్యమం ఆగదు’
ABN , First Publish Date - 2023-06-26T00:26:32+05:30 IST
పిఠాపురం, జూన్ 25: తెలుగుదేశం పార్టీ హాయాంలో నిర్మించిన టిడ్కో అపార్ట్‌మెంట్లును లబ్ధిదారులకు అప్పగించే వరకూ ఉద్యమం ఆగదని పిఠాపురం మాజీ ఎమ్మె ల్యే, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఎస్వీఎ్‌సఎన్ వర్మ స్పష్టం చేశారు. టిడ్కో ఇళ్లు లబ్ధిదారులకు అప్పగించాలని, ఇళ్లపట్టాలిచ్చిన వారికి లేఅవుట్లు అభివృ
పిఠాపురం, జూన్ 25: తెలుగుదేశం పార్టీ హాయాంలో నిర్మించిన టిడ్కో అపార్ట్‌మెంట్లును లబ్ధిదారులకు అప్పగించే వరకూ ఉద్యమం ఆగదని పిఠాపురం మాజీ ఎమ్మె ల్యే, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఎస్వీఎ్‌సఎన్ వర్మ స్పష్టం చేశారు. టిడ్కో ఇళ్లు లబ్ధిదారులకు అప్పగించాలని, ఇళ్లపట్టాలిచ్చిన వారికి లేఅవుట్లు అభివృద్ధి చేసి స్థలాలు చూపించాలని డిమాండ్ చేస్తూ టీడీపీ ఆధ్వర్యంలో పిఠాపురం మున్సిపల్ కార్యాలయం సమీపంలో నిర్వహిస్తున్న రిలేనిరాహారదీక్షలు ఆదివారం నాల్గోరోజుకి చేరా యి. వారికి సంఘీభావం తెలిపిన వర్మ మాట్లాడుతూ టిడ్కో లబ్ధిదారులకు జగన్ సర్కార్ తీరని అన్యాయం చేసిందన్నారు. నాయకులు రెడ్డెం భాస్కరరావు, బంగారు ద్వారక, రావుల రమేష్, ఉప్పు నాని, సిద్దాంతపు ప్రదీప్, చవ్వాకుల రాజా తదితరులు పాల్గొనగా, టీడీపీ జిల్లా ఆర్గనైజింగ్ కార్యదర్శి కొండేపూడి ప్రకాష్, బర్ల అప్పారావు, సోము సత్యనారాయణ, కొరుప్రోలు శ్రీను, నల్లా శ్రీనివాస్, రామచంద్రరావు ఉన్నారు.