ఏలేరు, సుద్దగడ్డ ఆధునికీకరణకు రాష్ట్ర బడ్జెట్‌లో మొండిచేయి
ABN , First Publish Date - 2023-03-17T23:59:50+05:30 IST
ఏలేరు, సుద్దగడ్డ ఆధునికీకరణకు రాష్ట్ర బడ్జెట్‌లో మొండిచేయి మిగిలిందని తె లుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎ్‌సఎన్ వర్మ విమర్శించారు. పిఠాపురం టీడీపీ కార్యాలయంలో శుక్రవారం సమావేశంలో ఆయన మాట్లాడుతూ బడ్జెట్‌లో అన్నింటా పిఠాపురం నియోజకవర్గానికి తీరని అన్యాయం జరిగిందన్నారు. ఏలేరు, సుద్దగడ్డ ఆధునికీకరణ రెండు విడతలకు నిధులు ఇస్తున్నట్టు సీఎం జగన్ ఎంతో ఆర్భాటంగా ప్రకటించారని గుర్తు చేశారు. పిఠాపురం పట్టణాభివృద్ధికి రూ.20కోట్లు, గొల్లప్రోలు పట్టణాభివృద్ధి
నిధులు ఇస్తున్నట్టు ప్రకటించిన సీఎం
ఎంపీ, ఎమ్మెల్యేలు సమాధానం చెప్పాలి
టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వర్మ
పిఠాపురం, మార్చి 17: ఏలేరు, సుద్దగడ్డ ఆధునికీకరణకు రాష్ట్ర బడ్జెట్‌లో మొండిచేయి మిగిలిందని తె లుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎ్‌సఎన్ వర్మ విమర్శించారు. పిఠాపురం టీడీపీ కార్యాలయంలో శుక్రవారం సమావేశంలో ఆయన మాట్లాడుతూ బడ్జెట్‌లో అన్నింటా పిఠాపురం నియోజకవర్గానికి తీరని అన్యాయం జరిగిందన్నారు. ఏలేరు, సుద్దగడ్డ ఆధునికీకరణ రెండు విడతలకు నిధులు ఇస్తున్నట్టు సీఎం జగన్ ఎంతో ఆర్భాటంగా ప్రకటించారని గుర్తు చేశారు. పిఠాపురం పట్టణాభివృద్ధికి రూ.20కోట్లు, గొల్లప్రోలు పట్టణాభివృద్ధికి మరో రూ.20కోట్లు ఇస్తున్నామని చెప్పారని అ యితే వీటికి బడ్జెట్‌లో ఎటువంటి నిధులు కేటాయించకపోవడం దారుణమన్నారు. దీనిపై ఎంపీ, ఎమ్మెల్యేలు సమాధానం చెప్పాలని వర్మ డిమాండ్ చేశారు. నిధులు విడుదల చేయని ముఖ్యమంత్రిని మీరు ఎందుకు ప్రశ్నించలేకపోతున్నారని నిలదీశారు. టీడీపీ హయాంలో ఏలేరు మొదటి విడత ఆధునీకరణ పనులు దాదాపు పూర్తి చేశామని, రెండో విడతలో ఏలేరు, సుద్దగడ్డ ఆధునికీకరణకు నాటి సీఎం చంద్రబాబు శంకుస్థాపన చేశారని గుర్తుచేశారు. రూ.145కోట్లును తాము మంజూరు చేయించి తెస్తే వాటిని ఎంపీ, ఎమ్మెల్యేలు రద్దు చేయించారని ఆరోపి ంచారు. పిఠాపురం, గొల్లప్రోలును టీడీపీ హయాంలో నే అభివృద్ధి చేశామని.. గొల్లప్రోలులో తాగునీటి సమస్య పరిష్కారానికి రూ.70కోట్లు నిధులు తెచ్చామని వివరించారు. ఎంపీ, ఎమ్మెల్యేలకు సత్తా ఉంటే తాము తెచ్చిన నిధులతో ఆధునికీకరణ, ఇతర పను లు పూర్తి చేయాలని ఆయన సవాల్ చేశారు. బడ్జెట్ అంతా అప్పుల తడకలుగా ఉందని విమర్శించారు.
2024 అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ విజయానికి ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఫలితం నాంది పలికిందని వర్మ తెలిపారు. వైసీపీ ఓటర్లను ఎన్ని ప్రలోభాలకు గురిచేసి, దొంగఓట్లు చేర్చి వారితో ఓట్లు వేయించి అడ్డదారులు తొక్కారన్నారు. వైసీపీ పాలనతో ప్రజలు ఎంత విసిగిపోయి ఉన్నారన్న దానికి ఇది నిదర్శనమన్నారు. సమావేశంలో టీడీపీ నాయకులు పాల్గొన్నారు.
బాధితురాలికి సాయం
కొత్తపల్లి: షార్ట్ సర్క్యూట్‌తో తాటాకిల్లు దగ్ధం కావడంతో నిరాశ్రయులైన కొత్తపల్లి మండలం ఎండపల్లి శివారు జొన్నలగరువుకు చెందిన బత్తిన రజనికి మాజీ ఎమ్మెల్యే వర్మ రూ.5వేలు నగదు అందించారు. బాధితురాలిని ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. టీడీపీ నాయకులు అనిశెట్టి సత్యానందరెడ్డి, ఎంపీటీసీ సత్తిబాబు, రవి కాశిబాబు పాల్గొన్నారు.