Share News

ఇబ్బందుల్లో ఉన్న ప్రజలకు లోకేశ్‌ భరోసా

ABN , First Publish Date - 2023-12-11T00:04:02+05:30 IST

పిఠాపురం, డిసెంబరు 10: వైసీపీ అరాచక పాలనతో ఇబ్బందులు, సమస్యల్లో కొట్టుమిట్టాడుతున్న ప్రజలకు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ యువగళం పా దయాత్ర ద్వారా భరోసా లభించిందని, వారికి అండగా నిలుస్తామని హామీ ఇచ్చారని పిఠాపురం మాజీ ఎమ్మెల్యే, టీడీపీ రాష్ట్ర అ

ఇబ్బందుల్లో ఉన్న ప్రజలకు లోకేశ్‌ భరోసా
పిఠాపురంలో మాట్లాడుతున్న వర్మ

టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వర్మ

పిఠాపురం, డిసెంబరు 10: వైసీపీ అరాచక పాలనతో ఇబ్బందులు, సమస్యల్లో కొట్టుమిట్టాడుతున్న ప్రజలకు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ యువగళం పా దయాత్ర ద్వారా భరోసా లభించిందని, వారికి అండగా నిలుస్తామని హామీ ఇచ్చారని పిఠాపురం మాజీ ఎమ్మెల్యే, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఎస్వీఎస్‌ఎన్‌ వర్మ తెలిపారు. పిఠాపురంలోని టీడీపీ కార్యాలయంలో ఆదివారం వర్మ మాట్లాడుతూ లోకేశ్‌ పాదయాత్ర ఈనెల 2,3న కొనసాగి, తుఫాన్‌ కారణంగా విరామం అనంతరం 9న పిఠాపురం నియోజకవర్గంలో జరిగిందన్నారు. 3రోజులు పాదయాత్రలో వివిధ వర్గాల ప్రజలు లోకేశ్‌కు తమ సమస్యలు వివరించారని తెలిపారు. పిఠాపురంలో జరగాల్సిన బహిరంగసభ లోకేశ్‌కు గొంతు నొప్పి కారణంగా రద్దయిందని చెప్పారు. పురుషోత్తపట్టణ ఎత్తిపోతల పథకం తిరిగి ప్రారంభిస్తామని, ఏలేరు, సుద్దగడ్డ ఆధునీకరణ పనులు చేపడతామని, పట్టురైతులకు షెడ్లు నిర్మాణానికి సబ్సిడీ, ఇతర సదుపాయాలు కల్పిస్తామని, బకాయిలు విడుదల చేస్తామని హామీ ఇచ్చారని తెలిపారు. గొల్లప్రోలు కాపు నేస్తం సభలో ఏలేరు, సుద్దగడ్డ ఆధునీకరణ పనులు చేపడతామని సీఎం జగన్‌ ఆర్భాటంగా ప్రకటించారని, ఇది జరిగిన 16 నెల లు గడిచినా ఇంతవరకూ కదలిక లేదని ఎద్దేవా చేశారు. మత్స్యకార గ్రామాలైన ఉప్పాడ, అమీ నాబాదు, మూలపేట, కోనపాపపేట, మాయాపట్నం, సుబ్బంపేట తదితర ప్రాంతాలు కోతకు గురికాకుండా శాశ్వత చర్యలు చేపడతామని, జియోట్యూబ్‌ నిర్మాణం చేపడతామని లోకేశ్‌ ప్రకటించారని చెప్పారు. నియోజకవర్గంలో టీడీ పీ హయాంలో జరిగిన అభివృద్ధి, తుఫాన్‌ కారణంగా జరిగిన నష్టం, ఇళ్లపట్టాలు ఇవ్వకపోవ డం తదితర అంశాలు లోకేశ్‌ దృష్టికి తీసుకువెళ్లినట్టు చెప్పారు. లోకేశ్‌ పాదయాత్రకు అపూర్వ రీతిలో స్వాగతం పలికి వేలాది మంది పాల్గొని విజయవంతం చేశారని...ఇందుకు టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు, టీడీపీ స్నేహితులందరికి కృతజ్ఞతలు తెలిపారు.

Updated Date - 2023-12-11T00:04:03+05:30 IST