Share News

టీడీపీకి ప్రజల్లో పెరుగుతున్న ఆదరణ

ABN , First Publish Date - 2023-11-27T00:34:05+05:30 IST

గొల్లప్రోలు రూరల్‌, నవంబరు 26: తెలుగుదేశం పార్టీకి ప్రజల్లో పెరుగుతున్న ఆదరణకు మత్స్యకార సొసైటీ ఎన్నికల్లో పార్టీ మద్దతుదారులు విజయం సాధించడమే నిదర్శనమని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్‌ఎన్‌ వర్మ తెలిపారు. గొల్లప్రోలు మం డలం చేబ్రోలులో జరిగిన శ్రీ సీతారామ జాలర్ల

టీడీపీకి ప్రజల్లో పెరుగుతున్న ఆదరణ
సీతారామ జాలర్ల సంఘం ప్రతినిధులను అభినందిస్తున్న మాజీ ఎమ్మెల్యే వర్మ

రాష్ట్ర అధికార ప్రతినిధి వర్మ

గొల్లప్రోలు రూరల్‌, నవంబరు 26: తెలుగుదేశం పార్టీకి ప్రజల్లో పెరుగుతున్న ఆదరణకు మత్స్యకార సొసైటీ ఎన్నికల్లో పార్టీ మద్దతుదారులు విజయం సాధించడమే నిదర్శనమని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్‌ఎన్‌ వర్మ తెలిపారు. గొల్లప్రోలు మం డలం చేబ్రోలులో జరిగిన శ్రీ సీతారామ జాలర్ల సహకార సంఘం ఎన్నికల్లో ఏకగ్రీవంగా ఎన్ని కైన పాలకవర్గ అధ్యక్షుడు దమ్ము నాగబాబు, కార్యదర్శి పెంకే సత్తిబాబు ఇతర ప్రతినిధులు ఆదివారం వర్మను కలవగా వారిని అభినందించారు. రానున్న ఎన్నికల్లో టీడీపీ విజయం ఖాయమన్నారు. కార్యక్రమంలో టీడీపీ మండలా ధ్యక్షుడు ఉలవకాయల దేవేంద్రుడు, ప్రదాన కార్యదర్శి మల్లిపూడి వీరబాబు తదితరులున్నారు.

టీడీపీలో చేరిక

పిఠాపురం రూరల్‌: టీడీపీ అధినేత నారా చంద్రబాబుని ముఖ్యమంత్రిని చేసుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్‌ఎన్‌ వర్మ అన్నారు. పిఠాపురం మండలం కందరాడ గ్రామానికి చెందిన సుమారు 30మంది యువత టీడీపీలో చేరారు. వారందరికి టీడీపీ కండువా లు కప్పి వర్మ పార్టీలోకి ఆహ్వానించారు. కాగా యువగళం పాదయాత్ర తిరిగి ప్రారంభమవుతున్న నేపథ్యంలో పిఠాపురం నుంచి ఐటీడీపీ, టీఎన్‌ఎస్‌ఎఫ్‌, యువత, నాయకులంతా కలిసి భారీగా తరలివెళ్లుతున్నట్టు వర్మ తెలిపారు. పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Updated Date - 2023-11-27T00:34:06+05:30 IST