Share News

వైసీపీ పాలనలో అన్నివర్గాలకు అన్యాయం

ABN , First Publish Date - 2023-11-24T23:41:32+05:30 IST

గొల్లప్రోలు, నవంబరు 24: వైసీపీ పాలనలో అన్ని వర్గాలకు అన్యాయం జరిగిందని పిఠాపురం మాజీ ఎమ్మెల్యే, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఎస్వీఎస్‌ఎన్‌ వర్మ విమర్శించారు. గొల్లప్రోలు పట్టణ శివారులోని తన అతిథిగృహం వద్ద శుక్రవారం చేబ్రోలు టీడీపీ నాయకులు, కార్యకర్తలతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ చేనేత కార్మికులను ఆదుకోవడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమయిందన్నారు. మగ్గాలకు ఏడాదికి రూ.24వేలు ఇస్తున్నట్లు చెబుతున్నా వాస్తవంలో నూలు ధర పెరగడం తదితర కారణాలతో వారిపై అంతకంటే మూడు రెట్లు అదనపు భారం పడుతున్నదని తెలి

వైసీపీ పాలనలో అన్నివర్గాలకు అన్యాయం
సమావేశంలో మాట్లాడుతున్న వర్మ


చేనేత కార్మికులను ఆదుకోవడంలో పూర్తిగా విఫలం

టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వర్మ

గొల్లప్రోలు, నవంబరు 24: వైసీపీ పాలనలో అన్ని వర్గాలకు అన్యాయం జరిగిందని పిఠాపురం మాజీ ఎమ్మెల్యే, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఎస్వీఎస్‌ఎన్‌ వర్మ విమర్శించారు. గొల్లప్రోలు పట్టణ శివారులోని తన అతిథిగృహం వద్ద శుక్రవారం చేబ్రోలు టీడీపీ నాయకులు, కార్యకర్తలతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ చేనేత కార్మికులను ఆదుకోవడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమయిందన్నారు. మగ్గాలకు ఏడాదికి రూ.24వేలు ఇస్తున్నట్లు చెబుతున్నా వాస్తవంలో నూలు ధర పెరగడం తదితర కారణాలతో వారిపై అంతకంటే మూడు రెట్లు అదనపు భారం పడుతున్నదని తెలిపారు. మరోవైపు జీఎస్టీ విధింపుతో చేనేత రంగం కుదేలైందన్నారు. నూలుపై సబ్సిడీపై ఇవ్వకపోవడంతో ఒక్కొక్క చేనేత కార్మికుడు ఏడాదికి రూ.75వేలు నష్టపోతున్నారని తెలిపారు. ప్రభుత్వ సహకారం లేకపోవడంతో చేనేత కార్మికులు వృత్తి మారిపోతున్నారని చెప్పారు. పట్టు రైతులకు టీడీపీ అధికారంలో ఉండగా నూరుశాతం సబ్సిడీపై పట్టుషెడ్లు నిర్మాణానికి రూ.10లక్షల వర కూ అందించే వారమని తెలిపారు. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక షెడ్డుకైనా నిధులు ఇచ్చామని ఎంపీ, ఎమ్మెల్యేలు చెప్పగలిగితే తాను చేబ్రోలు గ్రామంలో ఓటు అడగనని వర్మ సవాల్‌ చేశారు. పట్టుగూళ్లకు కిలోకు రూ.50లను ఇన్పెంటివ్‌గా ఇచ్చేవారమని, ఇప్పుడు దానిని ఎత్తివేశారని ఆయన తెలిపారు. సమావేశంలో టీడీపీ మండలశాఖ అధ్యక్షుడు ఉలవకాయల దేవేంద్రుడు, ప్రధాన కార్యదర్శి మల్లిపూడి వీరబాబు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-11-24T23:41:33+05:30 IST