టీడీపీ మేనిఫెస్టోతో భవిష్యత్తుకు భరోసా
ABN , First Publish Date - 2023-05-30T00:26:56+05:30 IST
పిఠాపురం, మే 29: మహానాడు వేదికగా తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు ప్రకటించిన మేనిఫెస్టో భవిష్యత్తుకు భరోసా కల్పించేదిగా ఉంద ని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎ్‌సఎన్ వర్మ తెలిపారు. పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ 5 కోట్ల మంది ప్రజలకు భవిష్యత్తుపై గ్యారంటీ ఇస్తూ ఆరు పథకాలను ప్రకటించారని చెప్పారు. మహిళలను అన్నివిధాల ఆదుకోవాల
రాష్ట్ర అధికార ప్రతినిధి వర్మ
పిఠాపురం, మే 29: మహానాడు వేదికగా తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు ప్రకటించిన మేనిఫెస్టో భవిష్యత్తుకు భరోసా కల్పించేదిగా ఉంద ని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎ్‌సఎన్ వర్మ తెలిపారు. పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ 5 కోట్ల మంది ప్రజలకు భవిష్యత్తుపై గ్యారంటీ ఇస్తూ ఆరు పథకాలను ప్రకటించారని చెప్పారు. మహిళలను అన్నివిధాల ఆదుకోవాలనే లక్ష్యంగా ఆడబిడ్డ నిధి కింద 18ఏళ్లు నిండిన ప్రతి మహిళకు నెలకు రూ.1500, చదువుకునే పిల్లలు ఎంతమంది ఉంటే అందరికి రూ.15వేలు వంతున, దీపం పథకం కింద ఏడాదికి మూడు సిలిండర్లు అందిస్తామని వివరించారు. అన్నదాత పథకం కింద ఏడాదికి రూ.20వేలు రైతులకు అందించడం, 20లక్షల ఉద్యోగాల కల్పన, నెల కు రూ.3వేల నిరుద్యోగ భృతి, ఇంటింటికి మంచినీటి కుళాయి తదితర అంశాలను చంద్రబాబు ప్రకటించారని వర్మ తెలిపారు. రాబోయే రోజుల్లో ప్రజల సంక్షేమానికి మరిన్ని పథకాలు ప్రకటించనున్నారని చెప్పారు. రాష్ట్రం అన్నిరంగాల్లో అభివృద్ధి సాధించాలంటే చంద్రబాబు మళ్లీ ముఖ్యమంత్రి కావాలని ప్రజలంతా కోరుకుంటున్నారని, అందుకు నిదర్శనమే మహానాడు తరలివచ్చిన అశేష ప్రజావాహిని అని తెలిపారు. మహానాడు కార్యక్రమానికి 10లక్షల మం ది తరలివచ్చారని, పిఠాపురం నియోజకవర్గం నుం చి 15వేల మంది తరలివెళ్లారని చెప్పారు. మహానాడును విజయవంతం చేసిన నియోజకవర్గ టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలకు వర్మ కృతజ్ఞతలు తెలిపారు. సమావేశంలో టీడీపీ జిల్లా ఉపాధ్యక్షుడు అల్లుమల్లు విజయకుమార్, ఆర్గనైజింగ్ కార్యదర్శి కొండేపూడి సూర్యప్రకాష్, బస్సా సత్యనారాయణ, పట్టణ, మండలాధ్యక్షులు రెడ్డెం భాస్కరరావు, సకుమళ్ల గంగాధర్, ఉలవకాయల దేవేంద్రుడు, బర్ల అప్పారావు, బత్తుల చైతన్యరాజేష్, మడికి ప్రసాద్, ఎలుబండి రాజారావు, నల్లా శ్రీను, అల్లవరపు నగేష్, కోళ్ల బంగారుబాబు పాల్గొన్నారు.