ఔషధ రంగంలో ఫార్మసిస్టుల పాత్ర ప్రముఖం

ABN , First Publish Date - 2023-09-26T01:29:13+05:30 IST

ఔషధ రంగంలో ఫార్మసిస్టుల పాత్ర ప్రముఖమైందని గైట్‌ ఫార్మసీ కళాశాల వైస్‌ ప్రిన్సిపాల్‌ ఎస్‌.రామచం ద్రన్‌ అన్నారు. ప్రపంచ ఫార్మాసిస్టుల దినోత్సవాన్ని గైట్‌ ఫార్మసీ కళాశాలలో సోమవారం ఘనంగా నిర్వహించారు.

ఔషధ రంగంలో ఫార్మసిస్టుల పాత్ర ప్రముఖం

రాజానగరం/దివాన్‌చెరువు, సెప్టెంబరు 25: ఔషధ రంగంలో ఫార్మసిస్టుల పాత్ర ప్రముఖమైందని గైట్‌ ఫార్మసీ కళాశాల వైస్‌ ప్రిన్సిపాల్‌ ఎస్‌.రామచం ద్రన్‌ అన్నారు. ప్రపంచ ఫార్మాసిస్టుల దినోత్సవాన్ని గైట్‌ ఫార్మసీ కళాశాలలో సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రామచంద్రన్‌ మాట్లాడుతూ ఆరోగ్య పరిరక్షణలో ఔషధాలు ముఖ్యమైన పాత్ర పోషిస్తాయని, ఔషధ సృష్టికర్త ఫార్మసిస్టే అని కొనియాడారు. దీనిలో భాగంగా ఫార్మసిస్ట్‌ మానవ ఆరోగ్యం కోసం నమ్మకాన్ని ప్రోత్సహించడంపై పోటీలు, రక్తదానం సేవా పక్‌వాడ శిబిరం నిర్వహించారు. రాజానగరం పీహెచ్‌సీ వైద్యాధికారి డాక్టర్‌ పి.సుజాత రక్తదానంపై ప్రజలకు ఉన్న అపోహలను నివృత్తి చేశారు. అనంతరం వివిధ పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో ఎన్‌ఎస్‌ఎస్‌ పీవో షేక్‌ మీరా, అధ్యాపకులు పాల్గొన్నారు. అలాగే దివాన్‌చెరువులోని వీజే ఫార్మశీ కళాశాలలో ప్రపంచ ఫార్మశీ దినోత్సవంలో కరస్పాండెంట్‌ ఎన్‌వీవీ జగన్మోహనరెడ్డి మాట్లాడారు. ప్రపంచంలో నానాటికీ పెరుగుతున్న కొత్తవ్యాధులు, వైరస్‌లను దృష్టిలో ఉంచుకుని మందులను తయారు చేయడం, నివారణా మార్గాలను కనుగొనడంలో ఫార్మాసిస్టుల పాత్ర కీలకమని అన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన వివిధ పోటీల్లో విజేతలకు బహుమతులను ప్రదానం చేశారు. కార్యక్రమంలో కళాశాల చైర్‌పర్సన్‌ ఎన్‌.శకుంతల, ప్రిన్సిపాల్‌ డి.నరేంద్ర తదితరులు పాల్గొన్నారు .

Updated Date - 2023-09-26T01:29:13+05:30 IST