పిఠాపురంలో సహస్ర చండీ రాజశ్యామల యాగం
ABN , Publish Date - Dec 18 , 2023 | 01:01 AM
కాకినాడజిల్లా పిఠాపురంలోని మాధవపురం రైల్వేగేటు సమీపంలోని వైష్ణవి గార్డెన్స్‌లో శ్రీ రుద్ర సహస్ర చండీ సహిత రాజశ్యామల యాగమహోత్సవం ఆదివారం ప్రారంభమైంది.
300 మంది వేదపండితులతో నిర్వహణ
పిఠాపురం, డిసెంబరు 17: కాకినాడజిల్లా పిఠాపురంలోని మాధవపురం రైల్వేగేటు సమీపంలోని వైష్ణవి గార్డెన్స్‌లో శ్రీ రుద్ర సహస్ర చండీ సహిత రాజశ్యామల యాగమహోత్సవం ఆదివారం ప్రారంభమైంది. లోక కల్యాణార్థం చేపట్టిన ఈ యాగానికి బీసీవైపార్టీ జాతీయ అధ్యక్షుడు బోడే రామచంద్రయాదవ్, సుశీల దంపతుల గణపతిపూజతో అంకురార్పణ జరిగింది. యాగం మొదటి రోజున గణపతిపూజ, పుణ్యాహవాచనం, రుత్విక్‌వరుణం, రుద్రాభిషేకం, శ్రీచక్ర లలితా సహస్ర నామార్చనలతో సహ పంచాయతన దేవతారాధన, అర్చన, రుద్రహోమం, చండీపారాయణం, హోమం జరిగాయి. సుమారు 300 మంది వేదపండితుల మంత్రోశ్చారణల మధ్య ఈ క్రతువు సాగింది. భక్తులు అధికంగా తరలివచ్చారు. బీసీవై స్టేట్ కోఆర్డినేటర్ డాక్టర్ అనూషాయాదవ్ పాల్గొన్నారు.