జగన్‌కు పరిపాలన చేతకాదు
ABN , Publish Date - Dec 31 , 2023 | 12:05 AM
పెద్దాపురం, డిసెంబరు 30: ముఖ్యమంత్రి జగన్‌కు పరిపాలన చేతకాదని ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప అన్నారు. స్థానిక మున్సిపల్ జంక్షన్ వద్ద అంగన్‌వాడీలు, మున్సిపల్ కార్మికుల చేపట్టిన సమ్మెకు శిబిరాలకు చేరుకుని ఆయన సంఘీభావం తెలియచేశారు. అనంతరం మా ట్లాడుతూ జగన్ రాష్ట్రాన్ని సర్వ
ఎమ్మెల్యే చినరాజప్ప
పెద్దాపురం, డిసెంబరు 30: ముఖ్యమంత్రి జగన్‌కు పరిపాలన చేతకాదని ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప అన్నారు. స్థానిక మున్సిపల్ జంక్షన్ వద్ద అంగన్‌వాడీలు, మున్సిపల్ కార్మికుల చేపట్టిన సమ్మెకు శిబిరాలకు చేరుకుని ఆయన సంఘీభావం తెలియచేశారు. అనంతరం మా ట్లాడుతూ జగన్ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారన్నారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీని ప్రజలు నామరూపాల్లేకుండా చేస్తా రన్నారు. టీడీపీ నేతలు రాజాసూరిబాబురాజు, తూతిక రాజు, నూనే రామారావు, సీఐటీయూ నాయకులు దారుపు రెడ్డి క్రాంతికుమార్, నీలపాల సూరిబాబు పాల్గొన్నారు.