ముక్కలు చేయండి
ABN , First Publish Date - 2023-08-21T00:57:06+05:30 IST
జిల్లాలోని పెదపూడి మండలాన్ని రెండుగా విభజించి రాజకీయ ప్రయోజనం పొందేందుకు వైసీపీ అడుగులు వే స్తోంది. ఈ మేరకు గొల్లల మామిడాడ కేంద్రంగా కొత్త మం డలం ఇవ్వాలంటూ ఆ పార్టీ నేతలు ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ఒత్తిడి తెస్తున్నారు. ఈ మేరకు అనపర్తి, కాకినాడ సిటీ ఎమ్మెల్యేలు సీఎం జగన్‌కు స్వయంగా లేఖలు రాసి కొత్త మండలం సంగతి తేల్చాలంటూ పావులు కదుపుతు న్నారు.
-పెదపూడి మండలాన్ని రెండు ముక్కలుగా చేసేందుకు వైసీపీ పావులు
-గొల్లలమామిడాడ కేంద్రంగా కొత్త మండలం ఏర్పాటుకు పభుత్వంపై నేతల ఒత్తిడి
-జనాభా ఎక్కువగా ఉన్నందున తొమ్మిది గ్రామాలతో కొత్త మండలం ఇవ్వాలని డిమాండ్
-సీఎం జగన్‌కు గుట్టుగా లేఖలు రాసిన అనపర్తి, కాకినాడ సిటీ ఎమ్మెల్యేలు
-ఎమ్మెల్యేల లేఖలను పరిశీలించాలంటూ కలెక్టర్‌కు సీఎంవో కార్యదర్శి నుంచి లేఖ
-మండలాన్ని రెండుగా విభజించే అంశంపై నివేదిక ఇవ్వాలని ఆర్డీవోను ఆదేశించిన కలెక్టర్
-పెరిగిపోయిన వ్యతిరేకత నుంచి బయటపడేందుకే వైసీపీ కొత్త మండలం ఎత్తుగడ
(కాకినాడ, ఆంధ్రజ్యోతి)
జిల్లాలోని పెదపూడి మండలాన్ని రెండుగా విభజించి రాజకీయ ప్రయోజనం పొందేందుకు వైసీపీ అడుగులు వే స్తోంది. ఈ మేరకు గొల్లల మామిడాడ కేంద్రంగా కొత్త మం డలం ఇవ్వాలంటూ ఆ పార్టీ నేతలు ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ఒత్తిడి తెస్తున్నారు. ఈ మేరకు అనపర్తి, కాకినాడ సిటీ ఎమ్మెల్యేలు సీఎం జగన్‌కు స్వయంగా లేఖలు రాసి కొత్త మండలం సంగతి తేల్చాలంటూ పావులు కదుపుతు న్నారు. ఇప్పుడీ వ్యవహారం పెదపూడి మండలంలో రాజకీ య కాక రేపుతోంది. మండల కేంద్రంగా ఉన్న పెదపూడిని దెబ్బకొట్టడానికే అనపర్తి ఎమ్మెల్యే ఎత్తుగడ వేశారంటూ ప్రతిపక్ష పార్టీలు ధ్వజమెత్తుతున్నాయి. మండలంలో వైసీపీ దూరమవుతున్న రెడ్డి సామాజికవర్గం ఓట్లను గంపగుత్తుగా రాబట్టుకునేందుకే మండలాన్ని ముక్కలు చేయడానికి పావులు కదుపుతున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
ముక్కలు చేసేయండి...
గతేడాది జిల్లాల విభజన నేపథ్యంలో తూర్పుగోదావరి జిల్లాలోని అనపర్తి నియోజకవర్గంలో ఉన్న పెదపూడి మం డలం కాకినాడ జిల్లాలో కలిసింది. ఇదంతా జరిగి ఏడాది దాటిపోగా కొత్తగా అనపర్తి వైసీపీ ఎమ్మెల్యే తన రాజకీయ ప్రయోజనంకోసం కొత్త ప్రతిపాదనను తెరపైకి తేవడం కాక రేపుతోంది. ఇందులోభాగంగా పెదపూడి మండలాన్ని రెండు గా విభజించి గొల్లల మామిడాడ కేంద్రంగా కొత్త మండలం ఏర్పాటయ్యేలా పావులు కదుపుతున్నారు. ఈ మేరకు సీఎం జగన్‌కు లేఖ రాశారు. 1986లో జి.మామిడాడను మండల కేంద్రంగా చేయాల్సి ఉన్నా జరగలేదని, ఈ నేపథ్యంలో 20 వేల జనాభా ఉన్న మామిడాడను మండల కేంద్రంగా చే యాలని ఈ ఏడాది మార్చి 20న రాసిన లేఖ తాజాగా బ యటపడింది. మామిడాడ కేంద్రంగా మండలం ఏర్పాటు చేసి సమీపంలోని తొమ్మిది గ్రామాలను అందులో కలపాల ని సీఎంకు రాసిన లేఖలో వివరించారు. అనపర్తి ఎమ్మెల్యే రాసిన లేఖకు వత్తాసుగా కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారం పూడి సైతం సీఎం జగన్‌కు అవే పాయింట్లతో ఏప్రిల్ 5న లేఖ రాశారు. జనాభారిత్యా అత్యధికంగా ఉన్న మామిడాడ ను మండల కేంద్రంగా ప్రకటించాలని అందులో కోరారు. కాగా సదరు ఇద్దరు ఎమ్మెల్యేల ప్రతిపాదనలకు బలం చేకూ ర్చేలా మామిడాడ సర్పంచ్‌పేరుతోను, ఈ ప్రతిపాదన తమ కు సమ్మతమేనంటూ సదరు పంచాయతీ పాలకవర్గ సభ్యు ల సంతకాలతో కూడిన లేఖను సైతం సీఎంకు పంపించా రు. కొత్తగా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్న గొల్లల మామిడాడ మండలంలో జి.మామిడాడ, పెద్దాడ, పుట్టకొండ, గండ్రేడు, సంపర, పైన, రాజుపాలెం, చింతపల్లి, వేండ్ర గ్రామాలతో కొత్త మండలం ఏర్పాటు చేయాలని డిమాండ్ ప్రభుత్వం ముందు ఉంచారు. కాగా ఎమ్మెల్యేల ప్రతిపాదన లు సీఎం కార్యాలయానికి వెళ్లడంతో ఈ లేఖలతోపాటు ఎమ్మెల్యేలు సిఫార్సు చేసిన విధంగా ప్రతిపాదనలు పరిశీ లించి పంపాలని సీఎం పేషీ నుంచి జిల్లా కలెక్టర్‌కు మే 4న లేఖ అందింది. ఈ నేపథ్యంలో పెదపూడి మండాలన్ని విభ జించే అంశంపై అధ్యయనం చేసి ప్రతిపాదనలు పంపాలని జిల్లా కలెక్టర్ కాకినాడ ఆర్డీవోను తాజాగా ఆదేశించారు.
అందుకేనా ఎత్తుగడ..
పెదపూడి మండలాన్ని విభజించేందుకు జరుగుతున్న ప్రయత్నాలపై టీడీపీ సహా ఇతర ప్రతిపక్ష పార్టీలు ఉద్య మానికి సిద్ధమవుతున్నాయి. వాస్తవానికి కొత్త మండలాల ఏర్పాటు, విభజనకు సంబంధించిన పలు ప్రతిపాదనలను జగన్ సర్కారు ఇటీవల పరిగణనలోకి తీసుకుని అనుకూల నిర్ణయాలు వెలువరించింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు కొత్తగా పెదపూడిని ముక్కలు చేయడంపై వైసీపీ ఎమ్మెల్యేలు లేఖ లు రాయడం వెనుక రాజకీయ ఎత్తుగడేననే విమర్శలు వ్యక్త మవుతున్నాయి. ముఖ్యంగా అసెంబ్లీ ఎన్నికలు ముంచుకు వస్తున్న తరుణంలో అనేక నియోజకవర్గాల్లో వైసీపీకి పూర్తి గా ఎదురుగాలి వీస్తోంది. అనపర్తి నియోజకవర్గంలో వైసీపీ గ్రాఫ్ పూర్తిగా పడిపోయింది.
కొన్నినెలల కిందట చంద్రబాబు పర్యటనను సైతం అనపర్తిలో అడ్డుకునేందుకు వైసీపీ ప్రయత్నించి భంగపడిం ది. అదే సమయంలో చంద్ర బాబు కొన్నిగంటలపాటు చీక ట్లో నడిచి కాలినడకన అనపర్తి చేరుకోవడం సంచలనంగా మారింది. అటు టీడీపీ మాజీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి సైతం వరుస పోరాటాలతో వైసీపీకి చెమటలు పట్టిస్తున్నా యి. అటు రెడ్డి సామాజికవర్గంలోను టీడీపీకి విపరీతంగా ఆదరణ పెరిగింది. ఈ నేపథ్యంలో టీడీపీని అడ్డుకోవాలంటే సొంత సామాజికవర్గాన్ని మచ్చిక చేసుకోవడం ఎమ్మెల్యే సూర్యనారాయణరెడ్డికి తప్పనిసరి అయింది. అందుకే తన సామాజికవర్గ ఓట్లు అధికంగా ఉన్న మామిడాడ కేంద్రంగా కొత్త మండలంగా ప్రతిపాదించారనే విమర్శలు వ్యక్తమవుతు న్నాయి. ఎమ్మెల్యే ప్రయత్నాలపై వైసీపీలోనే తిరుగుబాటు వస్తోంది. ఆయన తీరుకు నిరసనగా పెదపూడి వైసీపీ నేత లు కొందరు ప్రతిపక్షాలతో పోరాటం చేయడానికి సమా యత్తమవుతున్నారు. అటు అనపర్తి మండలాన్ని కూడా తన రాజకీయ ప్రయోజనం కోసం రెండు మండలాలుగా విభజించేలా సదరు ఎమ్మెల్యే రహస్యంగా పావులు కదుపు తున్నట్లు సమాచారం.