Share News

ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి

ABN , First Publish Date - 2023-11-10T00:47:34+05:30 IST

న్యాయ సేవాధికార సంస్థ ద్వారా ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయడం జరుగుతోందని ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ప్రధాన న్యాయమూర్తి(పీడీజే), జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్‌పర్సన్‌ గంధం సునీత పేర్కొన్నారు.

ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి
జాతీయ న్యాయ సేవల దినోత్సవాన్ని పురస్కరించుకుని వృద్ధులకు కళ్లజోళ్లు పంపిణీ చేస్తున్న పీడీజే గంధం సునీత, చిత్రంలో డీఎల్‌ఎస్‌ఏ కార్యదర్శి ప్రత్యూషకుమారి తదితరులు

రాజమహేంద్రవరం, నవంబరు 9(ఆంధ్రజ్యోతి): న్యాయ సేవాధికార సంస్థ ద్వారా ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయడం జరుగుతోందని ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ప్రధాన న్యాయమూర్తి(పీడీజే), జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్‌పర్సన్‌ గంధం సునీత పేర్కొన్నారు.జిల్లా న్యాయ సేవాధికార సంస్థ (డీఎల్‌ఎస్‌ఏ)లో జాతీ య న్యాయ సేవల దినోత్సవాన్ని గురువారం నిర్వహించారు.డీఎల్‌ఎస్‌ఏ న్యాయ సహా యాన్ని ప్రజలు వినియోగించుకోవాలని సీనియర్‌ సివిల్‌ జడ్జి కె.ప్రత్యూష కుమారి అన్నారు.వ్యాసరచన, వక్తృత్వం,ప్రశ్నావినోదం, చిత్రలేఖనం, స్కిట్‌ విభాగా ల్లోని విజేత లకు బహుమతులు,40 మంది పారిశుధ్య కార్మికులకు ఉచితంగా కళ్లజోళ్లను అందజే శారు.అంతకుముందు డీఎల్‌ఎస్‌ఏ నుంచి పుష్కరఘాట్‌ వరకూ ర్యాలీ చేశారు. కార్యక్ర మంలో అదనపు జిల్లా న్యాయమూర్తులు ఎం.మాధురి, ఎం.నాగేశ్వరరావు, వై.బెన్నయ్య నాయుడు,డి.విజయ్‌ గౌతమ్‌, బార్‌ అధ్యక్షుడు జీయూ వీబీ రాజు పాల్గొన్నారు.

Updated Date - 2023-11-10T00:47:39+05:30 IST