భారీ పండుగొప్ప లభ్యం
ABN , First Publish Date - 2023-07-03T00:35:32+05:30 IST
కేంద్రపాలిత ప్రాంతమైన యానాం నియోజకవర్గంలో మత్స్యకారులకు భారీ పండుగొప్ప పడింది. యానాం గోదావరిలో ఇంత భారీ చేప దొరకడం అరుదు.
యానాం, జూలై 2: కేంద్రపాలిత ప్రాంతమైన యానాం నియోజకవర్గంలో మత్స్యకారులకు భారీ పండుగొప్ప పడింది. యానాం గోదావరిలో ఇంత భారీ చేప దొరకడం అరుదు. గతంలో సుమారు 20 కేజీల చేప దొరకగా ఇప్పుడు 15 కేజీలకు పైగా ఉన్న మరో చేప దొరికింది. గోదావరిలో పండగొప్ప అంటే మంచి రుచి. యానాం గోదావరిలోని మత్య్సకారుల గేలాలకు చిక్కిన ఈ భారీ చేప స్థానిక మార్కెట్‌లో అదివారం పోనమండ భద్రం, రత్నం దంపతులు వేలం పాటలో పాడారు. రూ.9 వేల ధర పలికింది.