ఓపీఎస్‌ అమలు చేయాలని రైల్వే కార్మికుల ధర్నా

ABN , First Publish Date - 2023-08-22T01:11:39+05:30 IST

ఏఐఆర్‌ఎఫ్‌ తదితర కేంద్ర, రాష్ట్ర కార్మిక సంఘాలతో ఓపీఎస్‌(పాత పింఛను పథకం) సాధన కోసం ఏర్పాటు చేసిన జేఎఫ్‌ఆర్‌ఓపీఎస్‌ పిలుపుతో ఏఐఆర్‌ఎఫ్‌, ఎస్‌సీఆర్‌ఎంయూ నాయకత్వంలో రాజమండ్రి ఎస్‌సీఆర్‌ఎంయూలోని పలు శాఖల ఆధ్వర్యంలో సోమవారం ఉదయం సీనియర్‌ సెక్షన్‌ ఇంజనీరు(పీవే) కార్యాలయం వద్ద రైల్వే కార్మికులు నిరసన ప్రదర్శన నిర్వహించారు.

ఓపీఎస్‌ అమలు చేయాలని రైల్వే కార్మికుల ధర్నా

రాజమహేంద్రవరం, ఆగస్టు 21(ఆంధ్రజ్యోతి): ఏఐఆర్‌ఎఫ్‌ తదితర కేంద్ర, రాష్ట్ర కార్మిక సంఘాలతో ఓపీఎస్‌(పాత పింఛను పథకం) సాధన కోసం ఏర్పాటు చేసిన జేఎఫ్‌ఆర్‌ఓపీఎస్‌ పిలుపుతో ఏఐఆర్‌ఎఫ్‌, ఎస్‌సీఆర్‌ఎంయూ నాయకత్వంలో రాజమండ్రి ఎస్‌సీఆర్‌ఎంయూలోని పలు శాఖల ఆధ్వర్యంలో సోమవారం ఉదయం సీనియర్‌ సెక్షన్‌ ఇంజనీరు(పీవే) కార్యాలయం వద్ద రైల్వే కార్మికులు నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్‌సీఆర్‌ఎంయూ ఏడీఎస్‌/సెక్రటరీ కె.విజయకుమార్‌, ఓఎల్‌ బ్రాంచి కార్యదర్శి డీ.శ్రీనివాస్‌ రెడ్డి, ఇంజనీరింగ్‌ అండ్‌ మెకానికల్‌ బ్రాంచ్‌ చైర్మన్‌ ఎం.బాబు మాట్లాడుతూ.. ఎన్‌పీఎస్‌ రద్దుచేసి ఓపీఎస్‌ అమలు చేసేంతవరకూ ఉద్యమం కొనసాగుతుందన్నారు. కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడానికి సెప్టెంబరు, అక్టోబరులో కూడా ధర్నాలు చేస్తామన్నారు. నవంబరు 21, 22న కార్మికుల అభిప్రాయం తెలుసుకోవడానికి సమ్మె బ్యాలెట్‌ నిర్వహిస్తామని చెప్పారు. అప్పటికీ కేంద్రం దిగిరాకపోతే నిరవధిక సమ్మె తప్పదన్నారు. కార్యక్రమంలో ఎస్‌సీఆర్‌ఎంయూ చైర్మన్‌ జె.వసంతరావు, యూనియన్‌ బేరర్స్‌, సభ్యులు, కార్మికులు పాల్గొన్నారు.

Updated Date - 2023-08-22T01:11:39+05:30 IST