ఆన్‌లైన్‌ గేమ్‌లకు యువకుడి బలి

ABN , First Publish Date - 2023-06-07T01:12:41+05:30 IST

ఆన్‌లైన్‌ గేమ్‌లలో డబ్బులు పోగొట్టుకున్న యువకుడు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా కొత్తపేట మండలం గంటి శివారు పల్లిపాలెంలో చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించి ఎస్‌ఐ వి.మణికుమార్‌ తెలిపిన వివరాలు ఇలావున్నాయి..

ఆన్‌లైన్‌ గేమ్‌లకు యువకుడి బలి

ఇంట్లోనే ఉరి వేసుకుని ఆత్మహత్య

కొత్తపేట, జూన్‌ 6: ఆన్‌లైన్‌ గేమ్‌లలో డబ్బులు పోగొట్టుకున్న యువకుడు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా కొత్తపేట మండలం గంటి శివారు పల్లిపాలెంలో చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించి ఎస్‌ఐ వి.మణికుమార్‌ తెలిపిన వివరాలు ఇలావున్నాయి... గంటి పల్లిపా లేనికి చెందిన చీకరుమిల్లి సాత్విక్‌ (19) ఇంటర్‌ వరకు చదివి ఎలక్ట్రికల్‌ పనులు నేర్చుకుంటున్నాడు. అతడి తాత సుబ్బారావుకు ఆపరేషన్‌ చే యాల్సి రావడంతో విషయాన్ని దుబాయిలో ఉంటున్న మేనత్త పెనుమల ధనలక్ష్మికి విషయా న్ని తెలిపాడు. ఆమె సాత్విక్‌ బ్యాంకు ఖాతాకు రూ.70వేలు పంపింది. ఆన్‌లైన్‌గేమ్‌లకు అలవాటుపడ్డ సాత్విక్‌ ఆ డబ్బును ఆన్‌లైన్‌ జూదంలో పోగొట్టుకున్నారు. ఏం చేయాలో అర్థం కాక సోమవారం ఇంట్లో ఎవరూలేని సమయంలో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఎస్‌ఐ మణికుమార్‌ సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కొత్తపేట ప్రభుత్వ ఆసుపత్రి మార్చరీకి తరలించారు. సాత్విక్‌ తండ్రి రవికుమార్‌ ఇచ్చిన ఫిర్యాదు మేర కు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2023-06-07T01:12:41+05:30 IST