జీతాలు కోసం ఓఎన్జీసీ టెర్మినల్‌ వద్ద కార్మికుల ఆందోళన

ABN , First Publish Date - 2023-09-14T01:09:04+05:30 IST

ఓడలరేవు ఓఎన్జీసీ టెర్మినల్‌ గేటు వద్ద ఇతర రాష్ట్రాలకు చెందిన కాంట్రాక్టు కార్మికులు జీతాలు చెల్లించాలంటూ ఆందోళన చేపట్టారు.

జీతాలు కోసం ఓఎన్జీసీ టెర్మినల్‌ వద్ద కార్మికుల ఆందోళన

అల్లవరం, సెప్టెంబరు 13: ఓడలరేవు ఓఎన్జీసీ టెర్మినల్‌ గేటు వద్ద ఇతర రాష్ట్రాలకు చెందిన కాంట్రాక్టు కార్మికులు జీతాలు చెల్లించాలంటూ ఆందోళన చేపట్టారు. టాటా కంపెనీ సబ్‌ కాంట్ర్టాక్టు అయిన వేవ్‌ ఎనర్జీ కంపెనీలో ఉత్తరప్రదేశ్‌, బిహార్‌, బెంగాల్‌ రాష్ట్రాలకు చెందిన 180మంది పనిచేస్తు న్నారు. రెండు నెలలుగా జీతాలు ఇవ్వకపోవడంతో వారు ఆందోళనకు దిగారు. తినడానికి తిండి లేక, ఊళ్లకు వెళ్లడానికి డబ్బులు లేక, ఇంటి అద్దె, కిరాణాకు సొమ్ములు చెల్లించలేని స్థితిలో వున్నామని వాపోయారు. వేవ్‌ ఎనర్జీ కంపెనీ వెళ్లిపోగా బకాయి సొమ్ములు ఇస్తామంటూ నమ్మబలికిన టాటా కంపెనీ కూడా తమను పట్టించుకోలేదన్నారు. ఒక్కో ఒప్పంద కార్మికుడికి రోజుకు రూ.800 చెల్లించాల్సి ఉండగా దళారులు రూ.200 చొప్పున తీసుకుని తమ శ్రమను దోపిడీ చేస్తున్నారని ఆరోపించారు. ఈవిధంగా నెలకు రూ.9లక్షలు చొప్పున కార్మికుల సొమ్మును దళారులు దోచేస్తున్నారన్నారు. ఓ ప్రజాప్రతినిధి పేరు చెప్పుకుని అధికార పార్టీ నేతలే అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారన్న విమర్శలు ఉన్నాయి.

Updated Date - 2023-09-14T01:09:04+05:30 IST