చంద్రబాబును సీఎం చేయాలి

ABN , First Publish Date - 2023-05-26T01:03:16+05:30 IST

వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో చంద్రబాబును సీఎంని చేయడం చారిత్రక అవసరమని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు.

చంద్రబాబును సీఎం చేయాలి
వాడపాలెంలో ఎన్‌టీఆర్‌ విగ్రహావిష్కరణలో అచ్చెన్నాయుడు తదితరులు

కొత్తపేట, మే 25: వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో చంద్రబాబును సీఎంని చేయడం చారిత్రక అవసరమని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. ఎన్టీఆర్‌ శత జయంతిని పురస్కరించుకుని అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా కొత్తపేట మండలం వాడపాలెంలో కొత్తపేట అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌చార్జి బండారు సత్యానందరావు అధ్యక్షతన గురువారం ఎన్‌టీఆర్‌ విగ్రహాన్ని ఆవిష్కరించి మాట్లా డారు. వైసీపీ ప్రభుత్వ రాక్షస పాలనతో రాష్ట్ర ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. నాలుగేళ్లలో నాలుగు లక్షల కోట్ల అవినీతి జరిగిందన్నారు. సహజ వనరులు అయిన ఇసుక, మట్టి దోపిడీ చేస్తూ పేదలకు ఉపాధి లేకుండా చేశారన్నారు. రాష్ట్రానికి రాజధాని లేకుండా చేసిన జగన్‌ పాలనను 5 కోట్ల ఆంధ్రులు ఛీకొడుతున్నారన్నారు. కోడి కత్తి డ్రామాతో పాటు సొంత బాబాయిని హత్య చేసిన ఘనుడు జగన్‌ అన్నారు. ఈ ప్రభుత్వం శని ఎప్పుడు వదులుతుందోనని ఎదురు చూస్తున్నారన్నారు. కార్యక్రమంలో బండారు సత్యనారాయణమూర్తి, టీడీపీ జిల్లా అధ్యక్షురాలు రెడ్డి అనంతకుమారి, ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు, ముఖ్య నేతలు గొల్లపల్లి సూర్యారావు, అయితాబత్తుల ఆనందరావు, రెడ్డి సుబ్రహ్మణ్యం, గంటి హరీష్‌మాధుర్‌, చిల్లా జగదీశ్వరి, ఏజీవీ బుచ్చిమహేశ్వరరావు, ఆకుల రామకృష్ణ, నామన రాంబాబు, డొక్కా నాథ్‌బాబు, పెచ్చెట్టి చంద్రమౌళి పాల్గొన్నారు.

Updated Date - 2023-05-26T01:03:16+05:30 IST