ప్రతి దరఖాస్తు నమోదు చేయాలి
ABN , First Publish Date - 2023-12-03T00:51:27+05:30 IST
స్పెషల్ సమ్మరీ రివిజన్‌లో వచ్చే ప్రతి దరఖాస్తును, ఆ దరఖాస్తుపై తీసుకున్న చర్యలు రిజిస్టరులో నమోదు చేయాలని ఈఆర్వో సరళా సుందరం చెప్పారు.
రాజమహేంద్రవరం రూరల్ ఈఆర్వో సరళాసుందరం
పలుచోట్ల ఓటు నమోదు ప్రత్యేక కార్యక్రమం
రాజమహేంద్రవరం రూరల్, డిసెంబరు 2: స్పెషల్ సమ్మరీ రివిజన్‌లో వచ్చే ప్రతి దరఖాస్తును, ఆ దరఖాస్తుపై తీసుకున్న చర్యలు రిజిస్టరులో నమోదు చేయాలని ఈఆర్వో సరళా సుందరం చెప్పారు. ఓటర్ నమోదు ప్రత్యేక కార్యక్రమంలో భాగంగా మండలంలోని కోలమూరు పంచాయతీ పరిధిలో పోలింగ్ కేంద్రాన్ని ఆయన సందర్శించి ఓటరు నమోదు కార్యక్రమాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 1 జనవరి 2024కు 18 ఏళ్ల వయస్సు నిండే ప్రతిఒక్కరూ ఓటుకు దరఖాస్తు చేసుకోవాలన్నారు. స్పెషల్ సమ్మరీ రివిజన్‌లో భాగంగా ఈ నెల 2,3 తేదీల్లో ప్రత్యేక ఓటరు నమోదు, ఓటరు గుర్తింపు శిబిరాలను ఏర్పాటు చేసినట్టు చెప్పారు. ఎన్నికల కమిషన్ ఆదేశాల ప్రకారం నియోజకవర్గంలో ఈ నెల 9వ తేదీ వరకు ఓటరు లిస్టులో మార్పులు, చేర్పులు, తొలగింపులు, కొత్త ఓట్లు నమోదు కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. కార్యక్రమంలో ఆర్‌ఐ సాగర్, బీఎల్‌వోలు పాల్గొన్నారు.