Share News

ఇచ్చిన హామీలన్నీ గాలికివదిలేసిన జగన్‌రెడ్డి

ABN , Publish Date - Dec 31 , 2023 | 01:26 AM

ఇచ్చిన హామీలన్నీ గాలికివదిలేసిన జగన్‌రెడ్డి

ఇచ్చిన హామీలన్నీ గాలికివదిలేసిన జగన్‌రెడ్డి

కొత్తపేట, డిసెంబరు 30: ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి పాదయాత్రలో ఇచ్చిన 75శాతం హామీలను గాలికివదిలేసి ప్రజలను మోసం చేశారని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బండారు సత్యానందరావు పేర్కొన్నారు. శనివారం జరిగిన టీడీపీ సమావేశంలో మాట్లాడుతూ 730హామీలు ఇచ్చిన జగన్‌ 75శాతం హామీలను అమలు చేయ్యకపోగా టీడీపీ ప్రభుత్వం అమలుచేసిన 120సంక్షేమ పథకాలను రద్దుచేశారన్నారు. ఎస్సీ, ఎస్టీ మైనార్టీ నిధులను దారిమళ్లించి మోసం చేశారని. అలాగే ఒక పక్క జాబ్‌ క్యాలండరంటూ యువతకు అన్యాయం చేశారన్నారు. ప్రజలుఅన్ని గమనిస్తున్నారని తగిన రీతిలో బుద్ధిచెప్తారన్నారు. సమావేశంలో టీడీపీనాయకులు మెర్ల గోపాలస్వామి, ఈదల సత్తిబాబు, నాగిరెడ్డి వెంకటరత్నం, దొండపాటి సుబ్బరాజు, చెల్లుబోయిన సింహచలం, అడ్డాల రాజు, కొత్తపల్లి కృష్ణ, రమణరావు పాల్గొన్నారు.

Updated Date - Dec 31 , 2023 | 01:26 AM