ఉద్యోగాలు లేక యువత ఆత్మహత్యలు

ABN , First Publish Date - 2023-04-03T01:07:49+05:30 IST

రాష్ట్రంలో నిరుద్యోగుల సంఖ్య విపరీతంగా పెరిగిపోయిందని, ఉపాధి లేని యువత ఆత్మహత్యలకు పాల్పడుతున్నా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవ ట్లేదని మాజీ ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు విమర్శిం చారు.

ఉద్యోగాలు లేక యువత ఆత్మహత్యలు

అమలాపురం టౌన్‌, ఏప్రిల్‌ 2: రాష్ట్రంలో నిరుద్యోగుల సంఖ్య విపరీతంగా పెరిగిపోయిందని, ఉపాధి లేని యువత ఆత్మహత్యలకు పాల్పడుతున్నా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవ ట్లేదని మాజీ ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు విమర్శిం చారు. టీడీపీ హయాంలో పరిశ్రమల ద్వారా 5.13లక్షల మందికి ఉపాధి కల్పించినట్టు నాటి వైసీపీ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి అసెంబ్లీలో చెప్పిన విషయాన్ని జగన్‌ గుర్తెరగా లన్నారు. అమలాపురంలోని టీడీపీ కార్యాలయంలో తెలుగు యువత నియోజకవర్గ అధ్యక్షుడు గొలకోటి చిన్నా ఆధ్వర్యం లో ఆదివారం సమావేశం నిర్వహించారు. నాయకులు దెందు కూరి సత్తిబాబురాజు, మల్లుల పోలయ్య, తిక్కిరెడ్డి నేతాజీ, ఆవుపాటి వేణుగోపాల్‌, కాట్రు కృష్ణ, దాసం గోపి, నామాడి తారక్‌, కుడుపూడి సాయి, కాట్రు శ్రీనుబాబు పాల్గొన్నారు.

Updated Date - 2023-04-03T01:07:49+05:30 IST