జగన్ మాయ.. పుస్తకాలేవి!
ABN , First Publish Date - 2023-10-16T00:44:48+05:30 IST
జగన్ మాయా! మాకు పాఠ్యపుస్తకాలూ ఇవ్వ లేవా!!’అంటూ ఇంటర్మీడియట్ విద్యార్థులు మౌనంగా ప్రశ్నిస్తున్నారు. జగన్ ప్రభుత్వం విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు ఇవ్వలేని దుస్థితికి రాష్ట్రాన్ని నెట్టేసింది.
గతేడాది నుంచే నిలిపివేత
విద్యార్థులకు ఇబ్బందులు
ముందుకు సాగని చదువులు
పాత పుస్తకాలతోనే సర్దుబాటు
అవస్థగా ఇంటర్ విద్యా వ్యవస్థ
కొనుక్కోవాలని ప్రభుత్వ ఆదేశం
(రాజమహేంద్రవరం-ఆంధ్రజ్యోతి)
‘జగన్ మాయా! మాకు పాఠ్యపుస్తకాలూ ఇవ్వ లేవా!!’అంటూ ఇంటర్మీడియట్ విద్యార్థులు మౌనంగా ప్రశ్నిస్తున్నారు. జగన్ ప్రభుత్వం విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు ఇవ్వలేని దుస్థితికి రాష్ట్రాన్ని నెట్టేసింది. విద్యార్థులకు ప్రధాన అవసరాలైన పుస్తకాల వంటివి సమకూర్చకుండా పైపై మెరుగులతో విద్యా వ్యవస్థ ను అవస్థల పాలు చేస్తోందనే విమర్శలకు కొదువ లేదు. అంతే కాకుండా రాష్ట్ర ప్రభుత్వం ‘పాఠ్య పుస్తకాలు మార్కెట్లో కొనుక్కోండి’ అంటూ విద్యార్థుల కు ఉచిత ఆదేశాలు మాత్రం జారీ చేయడం పాల కుల బాధ్యతారాహిత్యానికి గొప్ప ఉదా హరణ..దీనిపై విద్యార్థి సంఘాలు పెదవి విరుస్తున్నాయి. జూన్ 1న తరగతులు ప్రారంభయ్యాయి. ఐదు నెలలు గడు స్తున్నా అధిక శాతం మంది విద్యార్థుల చేతుల్లో పాఠ్యపుస్తకాలు లేకపోవడంతో పాఠాలు చెప్పే క్రమం లో ఉపాధ్యాయులు కూడా ఇబ్బంది పడాల్సివస్తోంది.
గతేడాది నుంచే మంగళం
సవ్యంగా నడుస్తున్న వ్యవస్థలను అతలాకుతలం చేయడంలో పాలకులది అందె వేసిన చెయ్యిగా కని పిస్తోంది.ఎన్నో ఏళ్లగా ఇంటర్మీడియట్ విద్యార్థులకు పాఠ్య పుస్తకాలను ప్రభుత్వం(ఏ ప్రభుత్వం అధికా రంలో ఉన్నా) ఉచితంగా పంపిణీ చేస్తోంది. ప్రభుత్వ కళాశాలల్లో సాధారణంగా మధ్య తరగతి, పేద పిల్లలు చదువుకుంటారు. వారికి పాఠ్య పుస్తకాలు కొనుక్కోవడంలో కలిగే ఇబ్బందులు చదువుకు ఆటంకం కలిగించకూడదనే సదుద్దేశంతో ఆనాటి పాలకులు ఈ ఆలోచన చేశారు. కానీ వైసీపీ ప్రభుత్వం ఆ ఆలోచనకు గతేడాది నుంచే మంగళం పాడేసింది.అంతకుముందు ఏడాది మిగిలిన పుస్తకా లను గతేడాది విద్యార్థులకు కొంతవరకూ సరిపె ట్టారు. ఈ ఏడాది పాసై వెళ్లిపోయేవాళ్ల దగ్గర పాఠ్య పుస్తకాలను తీసుకొని కొత్తగా జాయిన్ అయిన పిల్లలకు ఇచ్చారు. అవీ విద్యార్థులందరికీ అందలేదు. ప్రభుత్వం పాఠ్య పుస్తకాలూ ఇవ్వలేకపోవడం విద్యా వ్యవస్థ దుస్థితికి నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తోంది.
సర్దుబాటు చేసుకుంటూ..
పది పాసై ఇంటర్మీడియట్ కోసం జూనియర్ కళాశాలల్లో అడుగు పెట్టగానే కాస్త పెద్ద వాళ్లు అయినట్లు అదో సంతోషంగా విద్యార్థులు ఫీలవుతుం టారు. కళాశాల వాతావరణం, కొత్త పుస్తకాలు, తరగది గదులు.. టీచర్ల స్థానంలో లెక్చరర్లు.. ఇలా కళాశాల వాతావరణమూ పిల్లల చదువుకు ఊత మిస్తుంది. అటువంటిది ఈ ప్రభుత్వం వచ్చాక హైస్కూల్ ప్లస్ అంటూ హైస్కూల్‌లోనే ఇంటర్ ప్రవేశపెట్టి ఫెయిలైపోయింది. ఆపై ఇంటర్ విద్యా ర్థులకు ఉచిత పాఠ్య పుస్తకాల పంపిణీ కూడా ఆపేసింది. ఇప్పుడు మార్కెట్లో కొనుక్కోవాలంటే పుస్త కాన్ని బట్టి ధర ఉంటుంది. ఏ గ్రూపునకు చూసినా మొత్తం పుస్తకాలు కొనుక్కుంటే రూ.2వేలు వరకూ ఖర్చవుతుంది.వీటికి నోటు పుస్తకాలు తదితర చదువు సామగ్రి అదనం. దీంతో చాలా మంది విద్యార్థుల చేతుల్లో పాత పుస్తకాలే కనిపిస్తున్నాయి. మరికొం దరు అన్ని పుస్తకాలు కాకుండా కొన్నిటిని మాత్రమే కొనుక్కుంటున్నారు.ఒక గ్రూపులో ఆరు పుస్తకాలుంటే మూడు ఒకరు, మరో మూడు ఇంకొకరు కొనుక్కొని సర్దుబాటు చేసుకుంటూ ఇబ్బంది పడుతున్నారు.
5,300 మందికి పుస్తకాల్లేవ్
తూర్పు గోదావరిలో 15 ప్రభుత్వ, 96 ప్రైవేటు, 2 ఎయిడెడ్, 6 సోషల్ వెల్ఫేర్, హైస్కూల్ ప్లస్ 17 కలుపుకొని మొత్తం 136 ఇంటర్మీడియట్ కళాశాలలు ఉన్నాయి. వీటిలో 40,600 మంది విద్యార్థులున్నారు. అన్ని గ్రూపుల్లో కలిపి 5,300 మంది ప్రభుత్వ కళాశాలల్లో విద్యనభ్యసిస్తు న్నారు. అంటే వీళ్లందరూ పుస్తకాలు కొనుక్కువాలంటే రూ.1కోటిపైనే వ్యయం చేయాల్సి ఉంటుంది. ఈ లెక్కన ఉమ్మడి తూర్పు గోదావరిలో అయితే రూ.3 కోట్లుపైనే విద్యార్థుల తల్లిదండ్రులు ఇంటర్ పుస్తకాల కోసం వెచ్చించాల్సి ఉంటుంది. ఈ పరిస్థితుల్లో విద్యార్థులు చాలా మంది కొత్త పుస్తకాలను కొనుక్కోవడం లేదు. లైబ్రరీలకు వెళ్లి నోట్సు రాసుకోవడం, పాత పుస్తకాలు ఉంటే తీసుకోవడం, పాత పుస్తకాల దుకాణాలకు వెళ్లి తక్కు వ ధరకు వచ్చేవి కొనుక్కోవడంతో సరిపెట్టుకుం టున్నారు. ఇలాంటి పరిస్థితులు విద్యార్ధుల మానసిక పరిస్థితితోపాటు చదువుపై కూడా ప్రతికూల ప్రభా వం చూపించే అవకాశం ఉందని మానసినక నిపుణులు అంటున్నారు. కుంగుబాటుకు గురయ్యే ప్రమాదమూ లేకపోలేదని చెబుతున్నారు.
మార్కెట్లో కొనుక్కోండి..
ఇంటర్ విద్యార్థులకు ఉచితంగా పాఠ్యపుస్త కాలను పంపిణీ చేసే బాధ్యతకు స్వస్తి చెప్పిన ప్రభుత్వం.. మార్కెట్లో కొనుక్కోవాలని మాత్రం ఉచిత ఆదేశాలు జారీ చేసేసింది. సేల్ కాంపొ నెంట్ కింద దుకాణాలకు ప్రభుత్వ ముద్రిత పాఠ్య పుస్తకాలు చేరాయని వాటిని విద్యార్థులు కొనుగోలు చేసే విధంగా చూడాలని డీవైఈవో /డీఐఈవో,ఆర్‌ఐవోలను ఆదేశిస్తూ ఈ ఏడాది జూన్ 13న ఇంటర్ బోర్డు ఆర్‌సీ నం. ఈఆర్టీ దబ్ల్యు/టెక్స్ట్‌బుక్స్/1/2023-24 సర్క్యులర్‌ని ఇంట ర్‌బోర్డు జారీ చేసింది. ఇది చూసిన అధికారులు విస్తుపోయారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువు కునే విద్యార్థులు రూ.1500-2000 వెచ్చించి ఎలా కొనుక్కోగలరంటూ ఆవేదన చెందారు. ప్రస్తుతానికి మార్కెట్లో ఇంటర్ కొత్త పుస్తకాలు ఉన్నా.. అధికశాతం విద్యార్థుల చేతుల్లో మాత్రం పాతవే కనిపిస్తున్నాయి. పుస్తకాలు లేని విద్యా ర్థులు ఇబ్బందులు పడుతున్నాయి.ప్రభుత్వం కళ్లు తెరవడంలేదనేవిమర్శలు వి నిపిస్తున్నాయి.