నిడదవోలు రైల్వే జంక్షన్‌కు మహరద్దశ
ABN , First Publish Date - 2023-08-02T23:48:48+05:30 IST
జిల్లాలోనే అటు మెట్ట ఇటు డెల్టా ప్రాంత ప్రజ లకు నిడదవోలు రైల్వే జంక్షన్. ఆదాయం బాగున్నా అభివృద్ధిలో వెనుకబడి ఉంది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం రైల్వేస్టేషన్ల అభివృద్ధికి శ్రీకారం చుట్టిన అమృత భారత్‌కు నిడదవోలు రైల్వే జంక్షన్ ఎంపికైంది.
అమృత భారత్‌కు ఎంపిక
6న వర్చువల్‌గా ప్రధాని మోదీచే ప్రారంభం
నిడదవోలు, ఆగస్టు 2 జిల్లాలోనే అటు మెట్ట ఇటు డెల్టా ప్రాంత ప్రజ లకు నిడదవోలు రైల్వే జంక్షన్. ఆదాయం బాగున్నా అభివృద్ధిలో వెనుకబడి ఉంది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం రైల్వేస్టేషన్ల అభివృద్ధికి శ్రీకారం చుట్టిన అమృత భారత్‌కు నిడదవోలు రైల్వే జంక్షన్ ఎంపికైంది. జిల్లాలోనే అమృత భారత్‌కు ఎంపికైన ఏకైక రైల్వే జంక్షన్ నిడదవోలు రైల్వేస్టేషన్. అమృత భారత్ పఽథకానికి ఎంపికైన జంక్షన్ సుమారు 1929లో నిడదవోలులో రైల్వేస్టేషన్ ఏర్పడింది. అప్పటి నుంచి అభివృద్ధి చెందుతూ నిడదవోలు జంక్షన్‌గా రూపాంతరం చెందింది. చెన్నయ్, హౌరా ప్రధాన రైల్వే మార్గంలో నిడదవోలు రైల్వే జంక్షన్ ఉంది. అప్పట్లో భీమవరం, నర్సాపురం వెళ్లాలంటే ఇక్కడ రైలు దిగి బ్రాంచి లైనులో రైలు మారి వెళ్లాల్సిందే. తరువాత కాలంలో బ్రాంచి లైనుమీదుగా కూడా ఎక్స్‌ప్రెస్ రైళ్ల రాకపోకలు సాగిస్తుండడంతో నిడదవోలు జంక్షన్ కాస్తా నిడదవోలు రైల్వేస్టేషన్‌గా మారిపోయింది. మరోపక్క స్టేషన్‌లోను మౌలిక సదుపాయాలు గాలికి వదిలేయడం సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌లు నిడదవోలు రైల్వేస్టేషన్‌లో ఆగకపోవడం అభివృద్ధి కాస్తా కుంటుపడింది.
అమృత భారత్‌తో మహర్ధశ
రైల్వే బోర్డు రైల్వేస్టేషన్ల అభివృద్ధికి నిడదవోలు రైల్వేస్టేషన్‌ను అమృత భారత్ పఽథకం కింద ఎంపిక చేశారు. ఈనెల 6వ తేదీ ఆదివారం ప్రధాని నరేంద్రమోదీ వర్చువల్‌గా అమృత భారత్‌కు ఎంపికైన స్టేషన్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. దీంతో ఆదివారం నిడదవోలు రైల్వేస్టేష న్‌లో జిల్లా కలెక్టర్ డాక్టర్ కె.మాధవీలత, ఎంపీ మార్గాని భరత్‌రామ్, ఎమ్మె ల్యే జి.శ్రీనివాస్‌నాయుడు, రైల్వే ఉన్నతాధికార్లతో స్థానిక రైల్వే అధికారులు భారీ సభ ఏర్పాటు చేయనున్నారు.
అమృత భారత్‌లో చేపట్టనున్న పనులు
రైల్వేబోర్డు సుమారు రూ.23కోట్లతో స్టేషన్లో అదనపు భవన నిర్మాణాలు, లిఫ్ట్, వెయిటింగ్ హాల్స్, టాయ్‌లెట్స్, ప్లాట్‌ఫామ్ పైకప్పు వంటి అభివృద్ధి పనులు చేపట్టనున్నారు. ప్రయాణికులకు ముఖ్యంగా సీనియర్ సిటి జన్స్‌కు మౌలిక సదుపాయాలకల్పనే ధ్యేయంగా పనులు ప్రారంభం కానున్నాయి.
ఆదాయం బాగున్నా అభివృద్ధి శూన్యం
నిడదవోలు రైల్వేస్టేషన్ నుంచి ప్రతినిత్యం సాధారణ రోజుల్లో సుమారు నాలుగు వేల వరకు పండుగ రోజుల్లో సుమారు ఏడువేల మంది ప్రయాణి కులు ఈ స్టేషన్ నుంచి రాకపోకలు సాగిస్తుంటారు. రైల్వేస్టేషన్ ఆదాయం ప్రయాణికుల టికెట్ల ద్వారా ఏడాదికి ఎనిమిది కోట్ల రూపాయలు వస్తు రవా ణాచేసే గూడ్స్‌ల ద్వారా రూ.20 కోట్లు మొత్తం 28కోట్ల సంవత్సర ఆదాయం వస్తోంది. ఆదాయం బాగుండి బి క్లాస్ కేటగిరిలో రైల్వేస్టేషన్ ఉన్నా కనీసం సి క్లాస్ స్టేషన్ మౌలిక సదుపాయాలు కూడా లేకుండా పోయాయి.
నిడదవోలులో ఆగని ఎక్స్‌ప్రెస్ రైళ్లు
విశాఖపట్టణం నుంచి సికింద్రాబాద్ రాకపోకలు సాగించే జన్మభూమి, కాకినాడ నుంచి సికింద్రాబాద్ రాకపోకలు సాగించే కోకనాడ ఎక్స్‌ప్రెస్, కాకినాడ నుంచి ముంబాయి రాకపోకలు సాగించే లోకమాన్యతిలక్, కోర మండల్ లాంటి సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు ఆగకపోవడంతో రైల్వే అధికార్లు, ప్రజాప్రతినిధులు హాల్ట్ కల్పించడంలో విఫలమయ్యారనే విమర్శలు వెల్లు వెత్తుతున్నాయి. ఇప్పుడు నిడదవోలు రైల్వేస్టేషన్ అమృత భారత్ ద్వారా మౌలిక సదు పాయాల కల్పనకు మహర్ధశపట్టడం అందరూ అభినందిస్తున్నా ముఖ్యంగా జన్మభూమి, లోకమాన్యతిలక్ లాంటి సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైళ్లకు నిడదవోలులో హాల్ట్ కల్పించినప్పుడే అమృత భారత్‌కు సార్ధకత చేకూరనుంది.
‘