రాబోయే కాలంలో టీడీపీదే అధికారం
ABN , First Publish Date - 2023-03-19T02:04:52+05:30 IST
రాబోయే కాలంలో ప్రజలు తెలుగు దేశం పార్టీకే అధికారం అప్పగిస్తారని, దీనికి నిదర్శనమనే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్య ర్థుల ఘన విజయమని టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ రెడ్డి సుబ్రహ్మణ్యం అన్నారు.

రామచంద్రపురం, మార్చి18: రాబోయే కాలంలో ప్రజలు తెలుగు దేశం పార్టీకే అధికారం అప్పగిస్తారని, దీనికి నిదర్శనమనే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్య ర్థుల ఘన విజయమని టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ రెడ్డి సుబ్రహ్మణ్యం అన్నారు. స్థానిక టీడీపీ కార్యాలయం వద్ద శనివారం రెడ్డి సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో పార్టీ నాయ కులు, కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు. కేక్ కట్‌చేసి స్వీట్లు పంచిపెట్టారు. కడియాల రాఘవన్, మేడిశెట్టి సూర్య నారాయణ, మేడిశెట్టి రవి, పెంకే సాంబశివరావు, జాస్తి చక్రవర్తి, చింతపల్లి వీరభద్రరావు, వెలుగుబంట్ల లక్ష్మణ రావు, కొసనా శ్రీను, ఈదల దొరబాబు, వనుం వీరబ్రహ్మం, వాసంశెట్టి కృష్ణ, రెడ్డి శేషారావు, కార్యకర్తలు పాల్గొన్నారు.