వచ్చే నెల 16న నర్సరీ సంఘం ఎన్నికలు
ABN , First Publish Date - 2023-06-26T00:26:05+05:30 IST
వచ్చేనెల 16వ తేదీన సర్ ఆర్థర్ కాటన్ నర్సరీ ఫార్మర్స్ అసోసియేషన్ సంస్థాగత ఎన్నికలు జరగనున్నాయి. ఈ మేరకు అసోసియేషన్ కార్యాలయం వద్ద ఆదివారం నర్సరీ ప్రతినిధుల సమావేశం జరిగింది. ఎన్నికల షెడ్యూల్‌ను పెద్దల, వలంటీర్ల, పూర్వపు పాలకవర్గ, ప్రస్తుత పాలకవర్గ కమిటీలు సమావేశమై తేదీని ప్రకటించాయి.
9, 10 తేదీల్లో నామినేషన్ల స్వీకరణ.. 11న ఉపసంహరణ
కడియం, జూన్ 25: వచ్చేనెల 16వ తేదీన సర్ ఆర్థర్ కాటన్ నర్సరీ ఫార్మర్స్ అసోసియేషన్ సంస్థాగత ఎన్నికలు జరగనున్నాయి. ఈ మేరకు అసోసియేషన్ కార్యాలయం వద్ద ఆదివారం నర్సరీ ప్రతినిధుల సమావేశం జరిగింది. ఎన్నికల షెడ్యూల్‌ను పెద్దల, వలంటీర్ల, పూర్వపు పాలకవర్గ, ప్రస్తుత పాలకవర్గ కమిటీలు సమావేశమై తేదీని ప్రకటించాయి. సుదీర్ఘ చర్చల అనంతరం నర్సరీ సంఘం ఎన్నికలకు ముహూర్తం ఖరారు చేశారు. నర్సరీ అసోసియేషన్ కార్యాలయం వద్ద జరుగనున్న ఈ ఎన్నికలకు సంబంధించి వచ్చే నెల 9, 10 తేదీల్లో ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. 11వ తేదీ ఉదయం 10గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణ జరుగుతుంది. అదే రోజు అభ్యర్థులకు గుర్తులు కేటాయింపు జరుగుతుంది. 15వ తేదీన సాయంత్రం వరకు పోటీలో ఉన్న అభ్యర్థులు ప్రచారం చేసుకోవాలి. 16వ తేదీ ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఎన్నికలు జరుగుతాయి. అదే రోజు 3 గంటల నుంచి లెక్కింపు జరుగుతుంది. అనంతరం విజేతలను ప్రకటిస్తారు.