జె.అన్నవరంలో పీహెచ్‌సీ ఏర్పాటుకు అనుమతులు

ABN , First Publish Date - 2023-06-10T00:01:31+05:30 IST

ఏలేశ్వరం, జూన్‌ 9: మండలంలోని జె.అన్నవరం గ్రామంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఏర్పాటుకు ప్రభు త్వం అనుమతులు మంజూరు చేసింది. దీంతో శుక్రవా రం పెద్దాపురం ఆర్డీవో జె.సీతారామారావు అధికారులు, ప్రజాప్రతినిధులతో గ్రామంలో పర్యటించి పీహెచ్‌సీ భవనాల నిర్మాణాలకు అనువైన స్థల పరిశీలన జరిపారు. చిన్నకొండ ప్రాంతం వద్ద రెవెన్యూశాఖ పరిధిలోని మూడు ఎకరాల భూమిని పరిశీలించి ఆసుపత్రి నిర్మాణాలకు అనువుగా ఉంటుందని గుర్తించారు. ఎంపిక చేసిన స్థలాన్ని ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు రెవెన్యూశాఖ నుంచి వైద్యఆరోగ్యశాఖకు బదలాయింపు ప్రక్రియ చేపట్టారు. చిన్నకొండ స్థలాన్ని అభివృద్ధి ప

జె.అన్నవరంలో పీహెచ్‌సీ ఏర్పాటుకు అనుమతులు
స్థల పరిశీలన జరుపుతున్న ఆర్డీవో, అధికారులు

స్థల పరిశీలన జరిపిన పెద్దాపురం ఆర్డీవో

ఏలేశ్వరం, జూన్‌ 9: మండలంలోని జె.అన్నవరం గ్రామంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఏర్పాటుకు ప్రభు త్వం అనుమతులు మంజూరు చేసింది. దీంతో శుక్రవా రం పెద్దాపురం ఆర్డీవో జె.సీతారామారావు అధికారులు, ప్రజాప్రతినిధులతో గ్రామంలో పర్యటించి పీహెచ్‌సీ భవనాల నిర్మాణాలకు అనువైన స్థల పరిశీలన జరిపారు. చిన్నకొండ ప్రాంతం వద్ద రెవెన్యూశాఖ పరిధిలోని మూడు ఎకరాల భూమిని పరిశీలించి ఆసుపత్రి నిర్మాణాలకు అనువుగా ఉంటుందని గుర్తించారు. ఎంపిక చేసిన స్థలాన్ని ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు రెవెన్యూశాఖ నుంచి వైద్యఆరోగ్యశాఖకు బదలాయింపు ప్రక్రియ చేపట్టారు. చిన్నకొండ స్థలాన్ని అభివృద్ధి పరచిన అనంతరం కొంత భాగాన్ని పీహెచ్‌సీ నిర్మాణాలకు కేటాయించాలని, మిగిలిన స్థలాన్ని ఇతర ప్రభుత్వ భవనాల నిర్మాణాలకు వినియోగించేలా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఆర్డీవో మాట్లాడుతూ జె.అన్నవరం, తూర్పులక్ష్మీపురం, మర్రివీడు తదితర మండలంలోని గ్రామాలతో పాటు ఏజెన్సీ ప్రాంతాలకు చెందిన వారు వైద్యచికిత్సల నిమి త్తం దూరంగా ఉన్న ఏలేశ్వరం ప్రభుత్వ సామాజిక ఆరోగ్యకేంద్రానికి వచ్చేందుకు ఎదురవుతున్న ఇబ్బందులను ఎమ్మెల్యే పర్వత పూర్ణచంద్రప్రసాద్‌ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారన్నారు. దీనిపై స్పందించిన ప్రభుత్వం జె.అన్నవరంలో పీహెచ్‌సీ ఏర్పాటు చేసేందుకు ఉత్తర్వులు జారీ చేయడంతో ఆసుపత్రి నిర్మాణాల కోసం స్థలం ఎంపిక ప్రక్రియ నిర్వహించామన్నారు. కార్యక్రమంలో తహశీల్దార్‌ జి.చిన్నారావు, మున్సిపల్‌ కౌన్సిలర్‌ అలమండ చలమయ్య, సొసైటీబ్యాంక్‌ చైర్మన్‌ కొండపల్లి వెంకటేశ్వరరా వు, రొంగల శ్రీనివాసరావు, కాలారి సత్తిబాబు, బాజింకు కన్నారావు, సామంతుల చిన్నారావు తదితరులున్నారు.

Updated Date - 2023-06-10T00:01:31+05:30 IST