9న జాతీయ లోక్ అదాలత్
ABN , First Publish Date - 2023-11-21T23:15:40+05:30 IST
సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు డిసెంబరు 9వ తేదీన జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్టు కొవ్వూరు 9వ అదనపు జిల్లా జడ్జి ఎన్.శ్రీనివాసరావు తెలిపారు.

కొవ్వూరు 9వ అదనపు జిల్లా జడ్జి శ్రీనివాసరావు
కొవ్వూరు, నవంబరు 21: సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు డిసెంబరు 9వ తేదీన జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్టు కొవ్వూరు 9వ అదనపు జిల్లా జడ్జి ఎన్.శ్రీనివాసరావు తెలిపారు. మంగళవారం కోర్టు హాలులో పోలీసు అధికారులతో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ లోక్ అదాలత్‌లో కేసులు రాజీ చేసుకోవడం వల్ల కక్షిదారుల సమయం, డబ్బు ఆదా అవుతాయన్నారు. రాజీ పడదగిన కేసులను పరిష్కరించేందుకు పోలీసు అధికారులు తగిన విధంగా ఏర్పాటు చేసుకోవాలన్నారు. సమావేశంలో ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి జి.ధర్మారావు, 1వ అదనపు జూనియర్ సివిల్ జడ్జి జె.బాలాత్రిపుర సుందరి దేవి, 2వ అదనపు జ్యుడీషియల్ ఫస్ట్‌క్లాస్ మేజిస్ట్రేట్ జి.సాయికృష్ణ, పోలీసు అధికారులు పాల్గొన్నారు.