మువ్వన్నెల రెపరెపలు
ABN , First Publish Date - 2023-08-16T01:24:28+05:30 IST
స్వాతంత్య్ర వేడుకలను పలుచోట్ల మంగళవారం ఘనంగా నిర్వహించిరు. కొవ్వూరు కోర్టు ప్రాంగణంలో ప్రిన్సిపాల్ సీనియర్ సివిల్ జడ్జి డి.సత్యవతి జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. కార్యక్రమంలో న్యా యమూర్తులు, న్యాయవాదులు, గుమస్తాలు, ఉద్యోగులు పాల్గొన్నారు.
ఘనంగా స్వాతంత్య్ర వేడుకలు
జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన అధికారులు, నాయకులు
స్వాతంత్య్ర సమరయోధులకు ఘన నివాళులు
అలరించిన విద్యార్థుల ప్రదర్శనలు
కొవ్వూరు, ఆగస్టు 15: స్వాతంత్య్ర వేడుకలను పలుచోట్ల మంగళవారం ఘనంగా నిర్వహించిరు. కొవ్వూరు కోర్టు ప్రాంగణంలో ప్రిన్సిపాల్ సీనియర్ సివిల్ జడ్జి డి.సత్యవతి జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. కార్యక్రమంలో న్యా యమూర్తులు, న్యాయవాదులు, గుమస్తాలు, ఉద్యోగులు పాల్గొన్నారు. ఆర్డీవో కార్యాలయంలో కార్యాలయ ఏవో జీఎస్‌ఎస్ జవహార్‌బాజీ జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. అనంతరం కార్యాలయ ప్రాంగణంలోని మహాత్మగాంధీ విగ్రహానికి నివాళులర్పించారు. మున్సిపల్ కార్యాలయంలో చైర్‌పర్సన్ బావన రత్నకుమారి పతాకాన్ని ఎగురవేశారు. కార్యక్రమంలో కమిషనర్ బి.శ్రీకాంత్, మేనేజర్ జి.రాధాకృష్ణ, కౌన్సిలర్లు పాలూరి నీలిమ, కిలాని వీరవెంకటలక్ష్మి మద్దిపట్ల సాయిగీత పాల్గొన్నారు. పట్టణ పోలీస్టేషన్‌లో సీఐ వి.జగదీశ్వరరావు జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. ఎస్‌ఐలు బి.దుర్గాప్రసాద్, డి.భూషణం, సిబ్బంది పాల్గొన్నారు. టీడీపీ కార్యాలయంలో ద్విసభ్య కమిటీ సభ్యులు జొన్నలగడ్డ సుబ్బరాయచౌదరి, కంఠమణి రామకృష్ణారావు, మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీవో కె.సుశీల ఆధ్వర్యంలో ఎంపీపీ కాకర్ల నారాయుడు, డీసీసీ బ్యాంకులో డైరెక్టర్ బండి లక్ష్మీనారాయణమ్మ, రామా సొసైటీలో అధ్యక్షుడు అక్షయపాత్ర శ్రీనివాస రవీంద్ర, ఏబీఎన్ పీఆర్‌ఆర్ డిగ్రీ కళాశాలలో ప్రిన్సిపాల్ నందిగం వెంకటసుబ్బారావు, పంగిడి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి అరిగెల అరుణకుమారి జాతీయ పతాకాన్ని ఎగురవేసి స్వాతంత్య్ర వేడుకలను నిర్వహించారు. కొవ్వూరు రైల్వేస్టేషన్ వద్ద బీజేపీ ఆధ్వర్యంలోను, ధర్మవరంలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో, అలాగే కొవ్వూరు పట్టణ, మండలంలోని ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు, పాఠశాలల్లో జాతీయ పతాకాన్ని ఎగురవేసి, స్వాతంత్య్ర వేడుకలను నిర్వహించారు. పంగిడిలో టీడీపీ జిల్లా అధ్య క్షుడు కేఎస్ జవహర్ మహాత్మగాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం గ్రామంలో జరిగిన జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. కొవ్వూరు టోల్‌గేట్ వద్ద జనసేన పార్టీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే టీవీ రామారావు జాతీయ పతాకాన్ని ఎగురవేసి, 25 మంది రిక్షా కార్మికులకు రూ.500 చొప్పున పంపిణీ చేశారు. హోలీ ఏంజల్స్ పాఠశాలలో కరస్పాండెంటు నెల్సన్ ఆంటోని జాతీయ పతాకాన్ని ఎగురవేసి, విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. ఆంధ్రా షుగర్స్ కర్మాగారంలో స్వాతంత్య్ర వేడుకలను ఘనంగా నిర్వహించారు.