చంద్రబాబుతో భువనేశ్వరి, బ్రాహ్మణి, అచ్చెన్నాయుడు ములాఖత్‌

ABN , First Publish Date - 2023-09-26T01:27:23+05:30 IST

(రాజమహేంద్రవరం- ఆంధ్రజ్యోతి) చంద్రబాబుతో సోమవారం ఆయన సతీమణి భువనేశ్వరి, కోడలు బ్రాహ్మణి, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ములాఖత్‌ అయ్యారు. మధ్యా

చంద్రబాబుతో భువనేశ్వరి, బ్రాహ్మణి, అచ్చెన్నాయుడు ములాఖత్‌
ములాఖత్‌ అనంతరం బయటకు వచ్చిన అచ్చెన్నాయుడితో మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు, ఆదిరెడ్డి తదితరులు

(రాజమహేంద్రవరం- ఆంధ్రజ్యోతి)

చంద్రబాబుతో సోమవారం ఆయన సతీమణి భువనేశ్వరి, కోడలు బ్రాహ్మణి, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ములాఖత్‌ అయ్యారు. మధ్యాహ్నం 3.45 గంటలకే వారు సెంట్రల్‌ జైలు వద్దకు చేరుకున్నారు. నాలుగు గంటలకు లోనికి వెళ్లి 4.50 ప్రాంతంలో బయటకు వచ్చారు. అనంతరం భువనేశ్వరి, బ్రాహ్మణి నేరుగా తాత్కాలిక నివాసానికి వెళ్లిపోగా, అచ్చెన్నాయుడు మీడియాతో మాట్లాడారు.

ప్రత్తిపాటి, కోమటి జయరాం పరామర్శ

రాజమహేంద్రవరం సిటీ/రూరల్‌ సెప్టెంబరు 26: టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబును ములాఖత్‌ ద్వారా కలిసిన రాష్ట్ర అధ్యక్షుడు కింజరపు అచ్చెన్నాయుడు రాజమహేంద్రవరం ఆర్‌వీ నగర్‌లోని లోకేశ్‌ క్యాంప్‌ శిబిరానికి చేరుకున్నారు. అంతకు అరగంట ముందే జైలు వద్దనుంచి భువనేశ్వరి, బ్రాహ్మణి క్యాంప్‌ శిబిరానికి చేరుకున్నారు. తర్వాత అచ్చెన్నాయుడు, మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు, తానా మాజీ అధ్యక్షుడు కోమటి జయరామ్‌ తదితర ప్రముఖులు వచ్చారు. కొద్దిసేపు వారు భువనేశ్వరి, బ్రాహ్మణిలతో మాట్లాడారు. అప్పటికే భువనేశ్వరి, బ్రాహ్మణిలను కలిసేందుకు విజయవాడ, అమరావతి నుంచి పెద్ద సంఖ్యలో జనం వచ్చారు.

Updated Date - 2023-09-26T01:28:01+05:30 IST