ఇక జనంలోకి.. భువనేశ్వరి, బ్రాహ్మణి

ABN , First Publish Date - 2023-09-26T01:30:41+05:30 IST

(రాజమహేంద్రవరం- ఆంధ్రజ్యోతి) టీడీపీ జాతీయ అధ్యక్షుడు, మాజీ సీఎం నారా చంద్రబాబునాయుడు వైసీపీ ప్రభుత్వం తప్పుడు ఆరోపణలతో, ఆధారాలేకుండానే స్కిల్‌ స్కామ్‌ పేరిట అరెస్టు చేసి ఈనెల 9వ తేదీ నుంచి రాజ మహేంద్రవరం సెంట్రల్‌ జైలులో రిమాండ్‌లో ఉంచిన సంగతి తెలిసిందే. సార్వత్రిక ఎన్నికలు రానున్న సమయంలో చంద్రబాబును జైలులోకి పంపడం ద్వారా టీడీపీ నైతిక స్థైర్యం దెబ్బతీసి, ఎన్నికల్లో లాభపడాలనేది వైసీపీ వ్యూహంగా ప్రజలు

ఇక జనంలోకి.. భువనేశ్వరి, బ్రాహ్మణి

జైలులో చంద్రబాబు

ప్రజల నుంచి బాబుకు వెల్లువెత్తుతున్న మద్దతు

భువనేశ్వరి, బ్రాహ్మణి సైతం జనంతో మమేకమయ్యే ప్రయత్నం

వైసీపీ నేతల్లో వణుకు

(రాజమహేంద్రవరం- ఆంధ్రజ్యోతి)

టీడీపీ జాతీయ అధ్యక్షుడు, మాజీ సీఎం నారా చంద్రబాబునాయుడు వైసీపీ ప్రభుత్వం తప్పుడు ఆరోపణలతో, ఆధారాలేకుండానే స్కిల్‌ స్కామ్‌ పేరిట అరెస్టు చేసి ఈనెల 9వ తేదీ నుంచి రాజ మహేంద్రవరం సెంట్రల్‌ జైలులో రిమాండ్‌లో ఉంచిన సంగతి తెలిసిందే. సార్వత్రిక ఎన్నికలు రానున్న సమయంలో చంద్రబాబును జైలులోకి పంపడం ద్వారా టీడీపీ నైతిక స్థైర్యం దెబ్బతీసి, ఎన్నికల్లో లాభపడాలనేది వైసీపీ వ్యూహంగా ప్రజలు గమనిస్తున్నారు. కానీ వైసీపీ వేసిన ఎత్తు గడతో చంద్రబాబును ఇంకా జైలులో రిమాండ్‌ లోనే ఉంచగలిగారు. కానీ ఆయన మీద ఇంత వరకూ ఒక్క ఆరోపణ కూడా రుజువు చేయలేక పోయారు. పరిస్థితి ఇలా ఉండగా చంద్రబాబును జైలులో పెట్టడంతో రాష్ట్రంలోనే కాదు.. జాతీయ, అంతర్జాతీయ స్థాయిల్లోనూ నిరసనలు హోరెత్తు తున్నాయి. దీంతో చంద్రబాబుకు మద్దతు విపరీ తంగా పెరిగింది. అంతేకాక గతంలో చంద్రబాబు ఏఏ అభివృద్ధి పనులు చేపట్టిందీ ఆయనగాని, పార్టీ అగ్రనాయకులు గానీ చెబుతుండేవారు. ఇవాళ యావత్తు ప్రపంచం ఆయనను అభివృద్ధి ప్రదాతగా కీర్తిస్తున్నాయి. ఆయన నాయకత్వానికి మరింత బలం చేకూరింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ తోపాటు నవ్యాంధ్ర సీఎంగానే కాక, జాతీయ స్థాయిలో కూడా ఒకానొక సమయంలో కీలకంగా వ్యవహరించిన చంద్రబాబును వైసీపీ తప్పుడు కేసుతో జైలు పెట్టిందనే అభిప్రాయం ప్రజల్లో ఆగ్ర హంతోపాటు ఆవేదననూ కలిగిస్తోంది. అంతేకా కుండా చంద్రబాబును జైలులో పరామర్శించడం తోపాటు జనసేన, తెలుగుదేశం కలిసి పోటీచేస్తా అధినేత పవన్‌కల్యాణ్‌ ప్రకటించడం ప్రజల్లో తీవ్ర చర్చకు దారితీసింది. ఇది ఆహ్వానించదగిన పరి ణామంగా తటస్థులు సైతం అభిప్రాయాలను వ్యక్తంచేస్తున్నారు. మరోవైపు జిల్లాలో టీడీపీ కేడర్‌ గత 12 రోజుల నుంచి దీక్షలు రకరకాల రూపాల్లో చేస్తున్నారు. దీంతో గ్రామ గ్రామాన ప్రజల్లో కద లిక వచ్చింది. ఒకపక్క పోలీసులు ఆంక్షలు విధి స్తున్నా, గృహ నిర్భంధాలు చేస్తున్నా, వాటిని లెక్క చేయకుండా నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. ప్రధానంగా ఎప్పుడూ అటు పార్టీ వ్యవహారా ల్లోనూ, ఇటు రాజకీయాల్లోనూ ఏనాడూ జోక్యం చేసుకోని చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి, ఆయన కోడలు బ్రాహ్మణి ప్రజల్లో వెళ్లి చైతన్యం తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. చంద్రబాబు రాజమ హేంద్రవరం సెంట్రల్‌ జైలులో ఉండడంతో లోకేశ్‌ ఇక్కడే క్యాంప్‌ ఆఫీసు ఏర్పాటుచేసుకున్నారు. అక్కడే భువనేశ్వరి, బ్రాహ్మణి ఉంటూ పార్టీ నేత లతోనూ, కార్యకర్తలతోనూ, తమకు సంఘీభావం తెలియజేయడానికి వచ్చిన వారితో మాట్లాడుతూ, ధన్యవాదాలు తెలియజేయడంతోపాటు కేడర్‌కు ఽధైర్యాన్ని నింపుతున్నారు. రాజమహేంద్రవరం కొవ్వొత్తున ర్యాలీలోనూ, వినాయక చవితి సంద ర్భంగా ఆలయాల పూజల్లోనూ కూడా వారు పా ల్గొన్నారు. బ్రాహ్మణి జనసేన ఉమ్మడి జిల్లా నేత లతో కూడా చర్చించారు. ఐటీ ఉద్యోగులలో ఉత్సాహాన్ని నింపారు. భువనేశ్వరి సోమవారం అన్నవరం దేవస్థానంలో పూజలు చేయడంతో పాటు, జగ్గంపేటలో కార్యకర్తల సభలో పాల్గొని ఉత్తేజకరమైన ఉపన్యాసం ఇచ్చారు. ఇవన్నీ పార్టీకి మరింత కొత్త ఉత్సాహాన్ని చేకూర్చాయి.

ఢిల్లీలోనే లోకేశ్‌..

సుప్రీం కోర్టులో న్యాయపోరాటం కోసం ఢిల్లీ వెళ్లిన నారా లోకేశ్‌ అక్కడ నుంచే పార్టీ నేతలను సమన్వయం చేసుకుంటున్నారు. అటు ఢిల్లీలోనూ, ఇక్కడ రాజమహేంద్రవరంలోనూ నేతలతో ఎప్పటికప్పుడు మాట్లాడుతూ దిశానిర్దేశం చేస్తున్నారు. త్వరలో యువగళం పాదయాత్ర కూడా ప్రారంభించనున్నారు.

వైసీపీలో వణుకు

తామొకటి తలిస్తే దైవం ఒకటి తలచినట్టు అయింది వైసీపీ పరిస్థితి. చంద్రబాబును జైలులో పెడితే తెలుగుదేశం దెబ్బతింటుందని భావించిన వైసీపీకి మొత్తం పునాదులే కదలిపోయే పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికే అన్ని వర్గాల ప్రజలు చంద్రబాబుకు బాహాటంగానే మద్దతు ఇవ్వగా వైసీపీ నేతల్లో మాత్రం వెన్నులో వణుకు మొదలైంది. ఇప్పటికే వచ్చే ఎన్నికలపై ఎన్నో ఆశలు పెట్టుకున్న వైసీపీ నేతలు తమ పరిస్థితి ఏంటనే అయోమయంలో పడిపోయారు. ఎన్నికల ముందు చంద్రబాబు అరెస్టు తమను ముంచుతుందోమోననే ఆందోళ నలోనే ఎక్కువమంది ఉన్నారని తెలుస్తోంది.

Updated Date - 2023-09-26T01:30:41+05:30 IST