చంద్రబాబు ఎలాంటి వారో మీరే నిర్ణయించండి!
ABN , First Publish Date - 2023-09-26T01:31:56+05:30 IST
‘‘చంద్రబాబు ప్రజల మనిషి. ఆయనే తప్పు చేయలేదు. ఆయనెలాంటి వారో మీ అందరికి తెలుసు. మీకోసం, మీ హక్కుల కోసం ఆయన జైలుకు వెళ్లారు. ఎప్పుడూ రోడ్లెక్కని మహిళలు సైతం చంద్ర బాబుకు న్యాయం జరగాలంటూ రహదారులపైకి వస్తున్నారు. అదీ మహిళలకు చంద్రబాబుపై ఉన్న నమ్మకం. ఆయన ఉంటే ధైర్యంగా ఉం టారని ప్రతి ఒక్కరూ అనుకుంటున్నారు. కుటుంబం కంటే ప్రజలే తనకు ఎక్కువగా భావిస్తూ చంద్రబాబు కష్ట

చంద్రబాబు ఏ తప్పు చేయలేదు
ఆయన మీ మనిషి.. మీకోసం,
మీ హక్కుల కోసం జైలుకు వెళ్లారు
ఆయన తప్పుచేస్తారంటే మీరు నమ్ముతారా
జగ్గంపేట సభలో ప్రజలను ఉద్దేశించి
సూటిగా ప్రశ్నించిన భువనేశ్వరి
ఎప్పుడూ రోడ్లెక్కని మహిళలు సైతం
బాబు కోసం వస్తున్నారంటూ వ్యాఖ్య
ప్రజలు, పార్టీ కేడర్ ఇస్తున్న
అండదండలు మరువలేనని కృతజ్ఞత
వేలల్లో తరలివచ్చిన కార్యకర్తలు,
మహిళలు ఉద్దేశించి భావోద్వేగ ప్రసంగం
ప్రజల అభివృద్ధి కోసమే చంద్రబాబు
నిరంతరం తపించారని గుర్తుచేసిన వైనం
అలాంటి వ్యక్తిని జైల్లో నిర్బంధించారని ఆవేదన
భువనేశ్వరిని చూసి పెద్దఎత్తున నినదించిన మహిళలు.. కరచాలనానికి పోటీ
కాకినాడ(ఆంధ్రజ్యోతి)/ జగ్గంపేట, సెప్టెంబరు 25:
‘‘చంద్రబాబు ప్రజల మనిషి. ఆయనే తప్పు చేయలేదు. ఆయనెలాంటి వారో మీ అందరికి తెలుసు. మీకోసం, మీ హక్కుల కోసం ఆయన జైలుకు వెళ్లారు. ఎప్పుడూ రోడ్లెక్కని మహిళలు సైతం చంద్ర బాబుకు న్యాయం జరగాలంటూ రహదారులపైకి వస్తున్నారు. అదీ మహిళలకు చంద్రబాబుపై ఉన్న నమ్మకం. ఆయన ఉంటే ధైర్యంగా ఉం టారని ప్రతి ఒక్కరూ అనుకుంటున్నారు. కుటుంబం కంటే ప్రజలే తనకు ఎక్కువగా భావిస్తూ చంద్రబాబు కష్టపడుతుంటారు. ఇప్పుడు మీరంతా ముందుకు రావడం మహిళా శక్తికి నిదర్శనం’’ అంటూ టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణి భువనేశ్వరి పేర్కొన్నారు. కష్టంలో ఉన్న తమ కుటుంబం కోసం వేలాదిగా తరలివచ్చిన మహిళలను చూసి ఆమె భావోద్వేగానికి గురై ప్రసంగించారు. చంద్రబాబు ఎలాంటి వారో మీరే నిర్ణయించండి అంటూ పిలుపునిచ్చారు. బాబును అక్రమంగా అరెస్టు చేసి సెంట్రల్ జైల్లో ఉంచినప్పటి నుంచి ఆయన సతీమణి భువనేశ్వరి రాజమహేంద్రవరంలోనే ఉంటున్నారు. అయితే ఆమె తన సోదరి మణి, కుటుంబ సభ్యులతో కలిసి సోమవారం అన్నవరం సత్యదేవుడిని దర్శిం చుకున్నారు. చంద్రబాబు వేగంగా బయటకు రావాలని ప్రార్థించారు. అక్కడి నుంచి మధ్యాహ్నం జగ్గంపేటకు చేరుకున్నారు. టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు జ్యోతుల నెహ్రూ, పార్టీ జిల్లా అధ్యక్షుడు జ్యోతుల నవీన్‌కుమార్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రిలే దీక్షల శిబిరాన్ని ఆమె సం దర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ చంద్రబాబు అక్రమ అరెస్టు నిరసిస్తూ ఆందోళన సాగిస్తున్న పార్టీ కార్యకర్తలు, నేతలకు సంఘీభావం ప్రకటించారు. చంద్రబాబు ఏ తప్పు చేయలేదని వీరందరి సమక్షంలో పునరుద్ఘాటించారు. అనుక్షణం ప్రజల కోసం, రాష్ట్రం కోసం పనిచేసే చంద్రబాబు తప్పు చేస్తారంటే మీరు నమ్ముతారా అని సూటిగా ప్రజలను ఉద్దేశించి ప్రశ్నించారు. ప్రజల కోసం, రాష్ట్రం కోసం కుటుంబా న్ని సైతం లెక్కచేయకుండా చంద్రబాబు కష్టపడి పనిచేశారని వివరిం చారు. అదే సమయంలో భువనేశ్వరిని చూసి జగ్గంపేటలో వేలాది జనం నినదించారు. జై చంద్ర బాబు అంటూ ప్లకార్డు లు ప్రదర్శించారు. తమ కుటుంబం ఎన్టీఆర్ చూపించిన విలువల బాటలో నడుస్తుందన్న భువనేశ్వరి ప్రజల సొమ్ము తమకు వద్దని, హెరిటేజ్‌లో రెండుశాతం వాటా విక్రయుంచినా రూ.400 కోట్లు వస్తాయని ప్రసంగించి తమ నిజాయితీని ప్రస్తావించారు. కేవలం ప్రజల కోసం, ప్రజల హక్కుల కోసం పోరాడుతున్నందుకే చంద్రబాబును జైల్లో నిర్బంధించారని ఆవేదన వ్యక్తంచేశారు. చంద్రబాబు సింహం లాంటి వ్యక్తి అని, ఆయన్ను అనవసరంగా రెచ్చగొడుతున్నారని హెచ్చ రించారు. తిరిగి బయటకు వచ్చి ప్రజల కోసం మరింత కసి బలంగా పనిచేస్తారని పేర్కొన్నారు. నేను ఒక్కటే అడుగుతున్నా... ఆయన ఏం తప్పుచేశారు. ఎందుకు తీసుకువెళ్లి జైల్లో నిర్బంధించారు.. మీకు కూడా తెలుసు ఆయన ఏం తీసుకోలేదు అని.. జరిగిందేటో... తెరవెనుక జరుగు తున్నదేంటో అందరికీ అర్థమయ్యేలా సూటిగా వివరించారు. ప్రజల సొ మ్ము అసలు తమకు అక్కర్లేదని, అలాంటి డబ్బు ఎలా వస్తుందో అలాగే పోతుందని, అటువంటి డబ్బు జీవితం నాశనం చేస్తుందన్నారు. చంద్ర బాబు స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఏర్పా టుచేయడం ద్వారా లక్షల మంది విద్యార్థులు లబ్ధిపొంది, లక్షల్లో సంపాదిస్తున్నారని, కొందరు సొంత కంపెనీలతో సీఈవోలు అయ్యారని గుర్తుచేసి స్కిల్ స్కాం బూట కమని అందరికీ అర్థమయ్యేలా ఆమె వివరించారు. తమ కుటుంబానికి సంఘీభావంగా వస్తున్న వారిని ప్రభుత్వం అడ్డుకుంటూ తన నైజాన్ని చాటుకుంటోందని వైసీపీకి చురకలంటించారు. బీఏ చదువుకున్న తనను చంద్రబాబు మంత్రి అయ్యాక హెరిటేజ్‌లో వది లేస్తే మూడు నెలలు కష్టపడి కంపెనీని నడిపించడం నేర్చుకున్నానని వివరిస్తూ కుటుంబంలో మహిళల బలం ఏపాటిదో వివరించారు. అక్రమ అరెస్టుకు నిరసిస్తూ బాబుకు మద్దతుగా కాకినాడ జిల్లా టీడీపీ ఆధ్వర్యంలో చేపట్టిన లక్ష సంతకాల సేకరణ కార్యక్రమాన్ని సంతకం చేసి ఆమె ప్రారంభించారు.
సత్యదేవుడి సన్నిధిలో భువనేశ్వరి పూజలు
అన్నవరం, సెప్టెంబరు 25: సత్యదేవుడి సన్నిధిలో సోమవారం మాజీ సీఎం, టీడీపీ జాతీయ అధ్యక్షుడు చందబ్రాబు సతీమణి భువనేశ్వరి.. స్వామిని దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తన భర్తపై పెట్టిన అక్రమ కేసులు వీడి కడిగిన ముత్యంలా బయటకు రావాలని స్వామిని ప్రార్థించారు. ఆమెకు ఆలయ సహాయ కమిషనర్ రమేష్‌బాబు, ఏపీఆర్వో పోల్నాటి లక్ష్మీనారాయణ ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. దర్శనానంతరం వేదపండితులు వేదాశీర్వచనాలు అందజేశారు. ఆమె వెంట టీడీపీ నేతలు నిమ్మకాయల చినరాజప్ప, జ్యోతుల నవీన్‌కుమార్, వరుపుల సత్యప్రభ, వర్మ, వనమాడి కొండబాబు, యనమల దివ్య, యనమల కృష్ణుడు, పర్వత సురేష్, వెన్నా ఈశ్వరుడు, మురళీకృష్ణంరాజు తదితరులు పాల్గొన్నారు.