27న నన్నయ పరిధిలో స్పాట్ అడ్మిషన్లు
ABN , Publish Date - Dec 21 , 2023 | 01:34 AM
ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం స్థానిక క్యాంపస్‌తో పాటు, కాకినాడ, తాడేపల్లిగూడెం క్యాంపస్‌లకు సంబంధించిన ఎంబీఏ, ఎంసీఏ కోర్సులలో ప్రవేశాలకు ఈనెల 27న స్పాట్ అడ్మిషన్లు నిర్వహిస్తున్నామని ఉపకులపతి ఆచార్య కె.పద్మ రాజు అన్నారు.
దివాన్‌చెరువు, డిసెంబరు20 : ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం స్థానిక క్యాంపస్‌తో పాటు, కాకినాడ, తాడేపల్లిగూడెం క్యాంపస్‌లకు సంబంధించిన ఎంబీఏ, ఎంసీఏ కోర్సులలో ప్రవేశాలకు ఈనెల 27న స్పాట్ అడ్మిషన్లు నిర్వహిస్తున్నామని ఉపకులపతి ఆచార్య కె.పద్మ రాజు అన్నారు. దీనికి సంబంధించిన వివరాలను బుధవ ారం ఆయన తెలిపారు. ఏపీఐసెట్ 2023లో అర్హులైన అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈడబ్ల్యూఎస్, సెల్ఫ్ రిపోర్టింగ్ కేటగిరీలలో పరి మిత సీట్లు అందుబాటులో ఉన్నాయన్నారు. నన్నయ విశ్వవిద్యాలయం స్థానిక ప్రాంగణంలో ఎంబీఏ 11 సీట్లు, ఎంబీఏ టూరిజం అండ్ హాస్పిటాలిటీ 18 సీట్లు, ఎంసీఏ ఎనిమిది సీట్లు ఉన్నాయన్నారు. కాకినాడ ప్రాంగణంలో ఎంబీఏ24, ఎంసీఏ 17 సీట్లు ఉన్నాయన్నారు. తాడేపల్లి గూడెం క్యాంపస్‌లో ఎంబీఏ 21 సీట్లు ఉన్నాయని తెలిపారు. అభ్యర్థులు తమ సర్టిఫికెట్లతో స్పాట్ అడ్మిషన్‌కు హాజరుకావాలని సూచించారు. ప్రవేశం నిర్ధారణ అయిన వెంటనే ఫీజు చెల్లించాలని చెప్పారు. ఈ స్పాట్ అడ్మిషన్లుకు సంబంధించి మరిన్ని వివరాలను విశ్వవిద్యాలయం వెబ్‌సైట్ ద్వారా తెలుసుకోవచ్చునని తెలిపారు.