‘నన్నయ’ కార్యనిర్వాహక మండలి పదవీకాలం పొడిగింపు

ABN , First Publish Date - 2023-03-31T01:22:35+05:30 IST

ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం ప్రస్తుత కార్యనిర్వాహక మండలి పదవీకాలాన్ని మరో 60 రోజులు పొడిగిస్తూ ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. 2020 లో మార్చి 23వ తేదీన మూడు సంవత్సరాల కాల పరిమితికి కార్యనిర్వాహక మండలిని నియమిస్తూ ఉత్తర్వులు నెం.47ను ప్రభుత్వం అప్పట్లో జారీ చేసింది.

 ‘నన్నయ’ కార్యనిర్వాహక మండలి పదవీకాలం పొడిగింపు

ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం

దివాన్‌చెరువు, మార్చి 30: ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం ప్రస్తుత కార్యనిర్వాహక మండలి పదవీకాలాన్ని మరో 60 రోజులు పొడిగిస్తూ ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. 2020 లో మార్చి 23వ తేదీన మూడు సంవత్సరాల కాల పరిమితికి కార్యనిర్వాహక మండలిని నియమిస్తూ ఉత్తర్వులు నెం.47ను ప్రభుత్వం అప్పట్లో జారీ చేసింది. అందులో పేర్కొన్న ప్రకారం ప్రస్తుతం ఉన్న ఈసీ పదవీకాలం ఈనెల 22వ తేదీతో ముగిసింది. ఈ నేపథ్యంలో ప్రస్తుత ఈసీ పదవీకాలాన్ని మరో 60 రోజులపాటు పొడిగిస్తూ జీవో 48ను ఉన్నత విద్యాశాఖ బుధవారం జారీ చేసింది. రాష్ట్ర నూతన కార్యనిర్వాహక మండలికి పేర్లును సమర్పించే ప్రక్రియను ప్రారంభించామని దాంతో ప్రస్తుతం ఉన్న విశ్వవిద్యాలయాల కార్యనిర్వాహక మండళ్ల పదవీ కాలాన్ని పొడిగించాలని రాష్ట్ర ఉన్నతవిద్యా మండలి అధికారులు కోరారని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. దీంతో ప్రభుత్వం ప్రస్తుత ఈసీ పదవీకాలాన్ని మరో 60 రోజులపాటు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. కాగా ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం ప్రస్తుత కార్యనిర్వాహక మండలిలో విశ్వవిద్యాలయాల సీనియర్‌ ప్రొఫెసర్‌ కేటగిరిలో ఆచార్య తుపాకుల అశోక్‌, విశ్వవిద్యాలయాల ప్రిన్సిపాల్‌ కేటగిరిలో ఆచార్య కె.శ్రీరమేష్‌, విశ్వవిద్యాలయాల టీచర్‌ కేటగిరిలో బి.జగన్మోహనరెడ్డి సభ్యులుగా కొనసాగుతున్నారు. వీరితోపాటు నన్నయ విశ్వవిద్యాలయం అనుబ ంధ కళాశాలల నుంచి ఒక టీచర్‌, ఒక ప్రిన్సిపాల్‌, వివిధ రంగాలకు చెందిన మరో నలుగురు ప్రముఖులు సభ్యులుగా ఉన్నారు. ప్రభుత్వం తాజా ఉత్తర్వుల తో వీరి పదవీకాలం మరో రెండు నెలలు పొడిగించినట్లయ్యింది.

Updated Date - 2023-03-31T01:23:01+05:30 IST