ముమ్మిడివరంలో సంబరాలు

ABN , First Publish Date - 2023-03-19T02:19:17+05:30 IST

పట్టభద్రుల గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులు ఘన విజయం సాధించడంతో శనివారం ముమ్మిడివరంలో టీడీపీ నాయకులు సంబరాలు జరుపుకున్నారు.

ముమ్మిడివరంలో సంబరాలు

ముమ్మిడివరం, మార్చి 18: పట్టభద్రుల గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులు ఘన విజయం సాధించడంతో శనివారం ముమ్మిడివరంలో టీడీపీ నాయకులు సంబరాలు జరుపుకున్నారు. మాజీ ఎమ్మెల్యే దాట్ల బుచ్చి బాబు, పార్లమెంటరీ టీడీపీ ఇన్‌చార్జి గంటి హరీష్‌మాధుర్‌లు పార్టీ కార్యాల యంలో నాయకులు, కార్యర్తల మధ్య కేక్‌ను కట్‌చేసి నాయకులకు తినిపించా రు. ఈ సందర్భంగా బుచ్చిబాబు మాట్లాడుతూ మూడు ఎమ్మెల్సీ ఎన్నికల్లో విద్యావంతులు ఇచ్చిన తీర్పు జగన్మోహన్‌రెడ్డికి చెంపపెట్టు అన్నారు. అమరా వతే రాజధాని అని, మూడు రాజధానులు వద్దని ఈ సందర్భంగా వారు ఓటింగ్‌తో తెలిపారన్నారు. తూర్పు రాయలసీమలో కూడా అత్యధిక మెజార్టీతో తమ పార్టీ అభ్యర్థి విజయం సాధించారన్నారు. హరీష్‌మాధుర్‌ మాట్లాడుతూ తూర్పు రాయలసీమ ఎన్నికల పరిశీలకునిగా వెళ్లిన తమకు అక్కడ ప్రజలు వైసీపీ రాక్షస పాలన అంతమవ్వాలని, టీడీపీ అధికారంలోకి రావాలని కోరుకు న్నారన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కీలక పాత్ర వహించిన దాట్ల బుచ్చిబాబు, గంటి హరీష్‌మాధుర్‌, గుత్తుల సాయిలను గజమాలలతో సత్కరించారు. కార్య క్రమంలో నాయకులు నాగిడి నాగేశ్వరరావు, గొలకోటి దొరబాబు, మందాల గంగసూర్యనారాయణ, చెల్లి అశోక్‌, టేకిమూడి లక్ష్మణరావు, తాడి నరసింహ రావు, పొద్దోకు నారాయణరావు, అర్థాని శ్రీనివాసరావు, దాట్ల బాబు, చిక్కాల అంజిబాబు, పొత్తూరి విజయభాస్కరవర్మ, సతీష్‌కుమార్‌లు పాల్గొన్నారు.

చంద్రబాబు పాలన కోరుకుంటున్నారు : గొల్లపల్లి

అంతర్వేది, మార్చి 18: రాష్ట్ర ప్రజలు చంద్రబాబు పాలన కోరుకుంటున్నారని మాజీమంత్రి గొల్లపల్లి సూర్యారావు అన్నారు. శనివారం రామేశ్వరం గ్రామంలో గ్రామ శాఖ అధ్యక్షుడు చెల్లింగి లీలామోహన్‌శ్రీనివాస్‌ అధ్యక్షతన జరిగిన సమావేశంలో గొల్లపల్లి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎఎమ్మెల్సీ ఎన్నికల పరిశీలకులుగా వెళ్లి చిరంజీవిరావు గెలుపునకు కృషి చేసిన మాజీ మంత్రి గొల్లపల్లిని రుద్రరాజు రాజా ఈ సందర్భంగా సన్మానించారు. అనంతరం కేక్‌ కట్‌చేసి అందరికీ పంచి విజయోత్సవ సంబరాలు జరుపుకున్నారు. కార్యక్రమంలో నల్లి విజయరత్నం, రుద్రరాజు రాజా, పోతురాజు కృష్ణ, పిండి సత్యనారాయణ, చాగంటి స్వామి, నల్లి విజయరత్నం, బొక్కా గోవిందు, బోనం సత్యనారాయణ, గుబ్బల ప్రసాద్‌, దొండపాటి సువర్ణజ్యోతి తదితరులు పాల్గొన్నారు.

టీడీపీ విజయంపై ఎమ్మెల్యే వేగుళ్ల హర్షం

మండపేట, మార్చి 18 : రాష్ట్రంలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థులు విజయం సాధించడం పట్ల మండపేట ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు హర్షం వ్యక్తంచేశారు. రాష్ట్రంలో ఎన్నికలు ఎప్పుడు జరిగినా టీడీపీ విజయం తథ్యమని, ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ విజయం ప్రజావిజయమని వేగుళ్ల అన్నారు. టీడీపీ బలపరిచిన అభ్యర్థుల విజయం పట్ల టీడీపీ సీనియర్‌ నాయకులు డీసీఎంఎస్‌ మాజీ చైర్మన్‌ రెడ్డి ప్రసాద్‌, విజయనగరం ఆర్టీసీ రీజియన్‌ మాజీ చైర్మన్‌ నెక్కంటి బాలకృష్ణ, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్‌ నల్లమిల్లి వీర్రెడ్డి, తదితరులు హర్షం వ్యక్తం చేసిన వారిలో ఉన్నారు.

ఎమ్మెల్సీ ఎన్నికల్లో ధర్మం గెలిచింది : నాథ్‌బాబు

పి.గన్నవరం, మార్చి 18: రాష్ట్రంలో వైసీపీ చేస్తున్న అరాచక పాలనపై ప్రజావ్యతిరేకత ఎమ్మెల్సీ ఎన్నికల్లో రుజువైందని రాష్ట్ర టీడీపీ కార్యనిర్వాహక కార్యదర్శి డొక్కా నాఽథ్‌బాబు పేర్కొన్నారు. ఆయన టీడీపీ ఎమ్మెల్సీల విజయంపై ఓ ప్రకటన విడుదలచేస్తూ వైసీపీ పాలనపై ప్రజలు విరక్తి చెందారని, ఈ ఎన్నికల్లో ధర్మమే గెలిచిందని ఆయన అన్నారు.

Updated Date - 2023-03-19T02:19:17+05:30 IST