నీతి సూర్యుడు ఉదయించె
ABN , Publish Date - Dec 26 , 2023 | 12:38 AM
క్రిస్మస్ వేడుకలను పలు చోట్ల క్రైస్తవులు ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా చర్చిలను విద్యుత్ దీపాలతోను, క్రిస్మస్ ట్రీ తోను విశేషంగా అలంకరించారు. ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.
పలుచోట్ల ఘనంగా క్రిస్మస్ వేడుకలు
విద్యుత్ దీపాలు, క్రిస్మస్ ట్రీలతో చర్చిల అలంకరణ
ప్రత్యేక ప్రార్థనలు.. దైవ జనుల వాక్య సందేశాలు
క్రీస్తు పుట్టుకను వివరించే క్రిబ్‌లు, నాటికల ప్రదర్శన
పెరవలి/రాజమహేంద్రవరం సిటీ, డిసెంబరు 25: క్రిస్మస్ వేడుకలను పలు చోట్ల క్రైస్తవులు ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా చర్చిలను విద్యుత్ దీపాలతోను, క్రిస్మస్ ట్రీ తోను విశేషంగా అలంకరించారు. ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. క్రైస్తవులు పరస్పరం శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఆయా ప్రాంతాల్లో చర్చిలు విశ్వాసులతో కళకళ్లాడాయి. క్రీస్తు జననం తెలిపే క్రిబ్‌లను ఏర్పాటు చేశారు. చిన్నారులు బంగారు వాక్యాలను చెప్పారు. క్రీస్తు పుట్టుకను వివరించే నాటికలను ప్రదర్శించారు. ఒకరికొకరు హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్ అంటూ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈ సందర్భంగా పెరవలి మండలం కాకరపర్రు గ్రామంలో రక్షణ సైన్యం చర్చిలో జరిగిన వేడుకల్లో పాస్టర్ జి.స్టీవెన్‌సన్, పూర్ణిమ మాట్లాడుతూ పాపులను రక్షించడం కోసం ఏసు క్రీస్తు ఈ లోకానికి దిగి వచ్చాడన్నారు. రెవ.ప్రవీణ్‌కుమార్, పాస్టర్ జీవీ రత్నం మాట్లాడుతూ ఏసుక్రీస్తు చూపిన బాటలో ప్రతిఒక్కరూ పయనించాలన్నారు. క్యాండిల్ సర్వీస్ వైభవంగా నిర్వహించారు. సండే స్కూలు విద్యార్థులు పలు సాంస్కృతిక ప్రదర్శనలిచ్చారు. యూత్ సభ్యులు పలు కీర్తలను ఆలపించారు. కార్యక్రమంలో ఉందుర్తి వెంకటేశ్వర్లు, ఖండవల్లి రాము, సిర్రా ఏసు, గుడాల శ్రీను, సొంగా చిన్న, సిర్రా శ్రీను, నేకూరి రాం బాబు, నేకూరి లక్ష్మణ్, కనకారావు, దిగుమర్తి అక్షింతరావు పాల్గొన్నారు.