Share News

బ్రిటీష్‌ పాలనను తలపిస్తున్న జగన్‌ ప్రభుత్వం

ABN , Publish Date - Dec 30 , 2023 | 01:36 AM

అమలాపురం టౌన్‌, డిసెంబరు 29: రాష్ట్రంలో బ్రిటీష్‌ పాలనను తలపించేలా జగన్‌ ప్రభుత్వం పరిపాలన సాగి స్తోందని ఉభయగోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ యిళ్ల వెంకటేశ్వరరావు ఆరోపించారు. రాష్ట్రంలో లా అండ్‌ ఆర్డర్‌ను ఇష్టానుసారంగా వినియోగించు

బ్రిటీష్‌ పాలనను తలపిస్తున్న జగన్‌ ప్రభుత్వం

ఎమ్మెల్సీ యిళ్ల వెంకటేశ్వరరావు

అమలాపురం టౌన్‌, డిసెంబరు 29: రాష్ట్రంలో బ్రిటీష్‌ పాలనను తలపించేలా జగన్‌ ప్రభుత్వం పరిపాలన సాగి స్తోందని ఉభయగోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ యిళ్ల వెంకటేశ్వరరావు ఆరోపించారు. రాష్ట్రంలో లా అండ్‌ ఆర్డర్‌ను ఇష్టానుసారంగా వినియోగించుకుంటున్నారన్నారు. సీఎం జగన్‌ శుక్రవారం భీమవరం పర్యటనకు వస్తున్నారని ముం దురోజు అర్ధరాత్రి యూటీఎఫ్‌ నాయకులను అరెస్టుచేసి పోలీసుస్టేషన్లకు తరలించడాన్ని ఆయన ఖండించారు. యూటీఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి గోపీమూర్తిని తెల్లవారుజామున రెండుగంటలకు అరెస్టుచేశారని, సీతారామరాజును, పాలకొ ల్లులో రామభద్రాన్ని అరెస్టుచేసి స్టేషన్లకు తరలించిన తీరు ను తప్పుబట్టారు. పాఠాలు చెప్పే ఉపాధ్యాయులను అరెస్టు చేస్తే వారికి సెలవుకు మీరేమైనా ఆర్డర్లు ఇస్తారా అని జగన్‌ ను ప్రశ్నించారు. జనంలోకి రావడానికి ఎందుకంత భయమ న్నారు. నీ ప్రభుత్వ కార్యక్రమాలను ప్రారంభించుకోవడానికి వచ్చి మా ఉపాధ్యాయులను ఎందుకు అరెస్టు చేస్తున్నారని మండిపడ్డారు. తక్షణం ఇటువంటి పరిస్థితులను వదిలించు కోవాలని హితవు పలికారు. అరెస్టుచేసిన ఉపాధ్యాయ సంఘ నేతలను తక్షణం విడుదల చేయాలని డిమాండు చేశారు.

Updated Date - Dec 30 , 2023 | 01:36 AM