ఎమ్మెల్సీ ఎన్నికల కోసం రెండు పోలింగ్‌ కేంద్రాలు

ABN , First Publish Date - 2023-02-21T01:34:19+05:30 IST

స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి జిల్లాలో రాజమహేంద్రవరం, కొవ్వూరులలో రెండు పోలింగ్‌ కేంద్రాలు సిద్ధం చేశామని, మొత్తం జిల్లా 410 మంది ఓటర్లు ఉన్నారని కలెక్టర్‌ డాక్టర్‌ కే మాధవీలత తెలిపారు. అమరావతి నుంచి రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో వివరాలు తెలిపారు. ఆరుగురు ఎమ్మెల్యేలు, ఎంపీకి కూడా ఓటు ఉందన్నారు. ఓటర్ల జాబితా

ఎమ్మెల్సీ ఎన్నికల కోసం రెండు పోలింగ్‌ కేంద్రాలు

410 మంది ఓటర్లు

రాజమహేంద్రవరం, ఫిబ్రవరి20 (ఆంధ్రజ్యోతి): స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి జిల్లాలో రాజమహేంద్రవరం, కొవ్వూరులలో రెండు పోలింగ్‌ కేంద్రాలు సిద్ధం చేశామని, మొత్తం జిల్లా 410 మంది ఓటర్లు ఉన్నారని కలెక్టర్‌ డాక్టర్‌ కే మాధవీలత తెలిపారు. అమరావతి నుంచి రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో వివరాలు తెలిపారు. ఆరుగురు ఎమ్మెల్యేలు, ఎంపీకి కూడా ఓటు ఉందన్నారు. ఓటర్ల జాబితా దావాలు, అభ్యంతరాలు పరిష్కారం, డూప్లికేట్‌, సందేశాత్మక ఓట్లు, బ్యాలెట్‌ బాక్సులు, ఎంసీసీ, ఫ్లయింగ్‌ స్క్వాడ్స్‌ టీమ్స్‌ గురించి చర్చించినట్టు ఆమె తెలిపారు. కొవ్వూరు, రాజమహేంద్రవరం తహశీల్దార్‌ కార్యాలయాల్లో పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. రాజమహేంద్రవరం డివిజన్‌లో స్థానిక సంస్థల కోటాలో 168 మంది ఓటర్లు ఉండగా, అందులో 90 మంది మహిళలు, ఏడుగురు పురుషులు ఉన్నారన్నారు. ముగ్గురు ఎమ్మెల్యేలు, ఎంపీ ఓటు ఉందన్నారు. కొవ్వూరు డివిజన్‌లో 242 మంది ఓట ర్లుండగా, అందులో 135 మంది మహిళలు, 107 మంది పురుషులు ఉన్నారని, ముగ్గురు ఎమ్మెల్యేలకు ఓటు హక్కు ఉందన్నారు.

Updated Date - 2023-02-21T01:34:21+05:30 IST