MLA Gorantla: నా సవాల్‌కు సీఎం జగన్ సిద్ధంగా ఉన్నారా?..

ABN , First Publish Date - 2023-01-02T13:09:06+05:30 IST

టీడీపీ (TDP) హయాంలో 54 లక్షల మందికి పెన్షన్‌లు ఇవ్వలేదని సీఎం జగన్ (CM Jagan) నిరూపిస్తే టీడీపీని రద్దు చేస్తామని, తన సవాల్‌కు ముఖ్యమంత్రి సిద్ధంగా ఉన్నారా? అంటూ...

MLA Gorantla: నా సవాల్‌కు సీఎం జగన్ సిద్ధంగా ఉన్నారా?..

అమరావతి: టీడీపీ (TDP) హయాంలో 54 లక్షల మందికి పెన్షన్‌లు ఇవ్వలేదని సీఎం జగన్ (CM Jagan) నిరూపిస్తే టీడీపీని రద్దు చేస్తామని, తన సవాల్‌కు ముఖ్యమంత్రి సిద్ధంగా ఉన్నారా? అంటూ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి (Gorantla Buchaiah Chaudhary) ప్రశ్నించారు. ఈ సందర్భంగా సోమవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ ఇప్పటికే జగన్ అర్హులైన 6 లక్షల మంది పెన్షన్ దారులను తొలగించారని అన్నారు. సీఎంకు 'The Great Lier' అని అవార్డ్ ఇవ్వాలని ప్రజలు భావిస్తు

న్నారన్నారు. పెన్షన్ పెంచుతామని మాట ఇచ్చి ముఖ్యమంత్రి జగన్ మాట తప్పడం వల్ల ఇప్పటి వరకు ఒక్కో పెన్షన్ దారుడు రూ. 33 వేలు నష్ట పోయారన్నారు.

ఇది రద్దుల ప్రభుత్వమని.. సలహాదారులకు ఇచ్చే జీతాలు వేస్టు అని.. వాటిని పెన్షన్ దారులకు ఇస్తే ఉపయోగమని ఎమ్మెల్యే గోరంట్ల అన్నారు. సీఎం జగన్ భాగోతం అంతా త్వరలో బయటపెడతామన్నారు. అర్హులు అయిన ప్రతి ఒక్కరికీ పెన్షన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే.. ముందు జగన్ ఆర్ధిక నేరాలపై దర్యాప్తు చేస్తామని స్పష్టం చేశారు. విద్య వ్యవస్థను భ్రష్టు పట్టిస్తున్నారని గోరంట్ల బుచ్చయ్య చౌదరి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

Updated Date - 2023-01-02T13:09:09+05:30 IST