మిరప ‘ఘాటు’

ABN , First Publish Date - 2023-01-18T01:19:53+05:30 IST

మార్కెట్లో ఎండు మిరపకాయల ధరలు ఘాటెక్కాయి. గత ఏడాదితో పోలిస్తే ఎండుమిర్చి ధర మండిపోతోందని వినియోగదారులు వాపోతు న్నారు.

మిరప ‘ఘాటు’
గండేపల్లి మండలం యల్లమిల్లి గ్రామంలో కళ్లంలో ఆరబెట్టిన ఎండుమిర్చి

ఎండుమిర్చి ధర కిలో రూ. 250 నుంచి రూ.300

ఎకరానికి 20 నుంచి 30 క్వింటాళ్ల వరకు దిగుబడి

పెట్టుబడులుపోను రైతులకు రూ.2 లక్షల వరకు ఆదాయం

గండేపల్లి, జనవరి 17: మార్కెట్లో ఎండు మిరపకాయల ధరలు ఘాటెక్కాయి. గత ఏడాదితో పోలిస్తే ఎండుమిర్చి ధర మండిపోతోందని వినియోగదారులు వాపోతు న్నారు. కానీ రైతులకు మాత్రం సంతోషాన్నిస్తోంది. నిజానికి ఈ ఏడాది మిర్చిసాగు మొదటి నుంచి కూడా వాతావరణంలో మార్పుల వల్ల ఆశాజనకంగా లేదు. అలాగే పంట పూత, పింది దశలో ఉన్నప్పుడు పంట నల్లి తెగులు సోకి చాలా ప్రాంతాల్లో పంట ఎండిపోవడంతోపాటు దిగుబడి తగ్గిపోయింది. పచ్చిమిర్చిగా అమ్ముదామంటే దిగుబడికి రాలేదు. అయితే రైతులు తెగులు నివారణకు ఎన్నో మందులు పిచికారి వేయడంతో తదుపరి వాతావరణ మార్పుల వల్ల పంట మళ్లీ ఆశాజనకంగా మారిం ది. దీంతో అప్పటికి పచ్చిమిర్చికి అధిక ధర లేకపోవడంతో ఎండుమిర్చి కోసం కాయ లను తోటపై వదిలేశారు. ఇప్పుడు ఎండుమిర్చి ధర విపరీతంగా పెరిగింది. ఇప్పటికే రైతులు కాయలు కోసి కళ్లాల్లో ఎండబెట్టారు. పలు చోట్ల ఎండుమిర్చిని వ్యాపారులు కిలో రూ.200 నుంచి రూ. 250 మధ్య రైతుల వద్ద నుంచి కొనుగోలు చేసుకుని వెళు తున్నారు. అదే వ్యాపారులు బయట మార్కెట్‌లో రూ.250 నుంచి 300 వరకు అమ్మ కాలు సాగిస్తున్నారు. దీంతో ఎండుమిర్చి రైతులకు ఈ సంవత్సరం అధిక లాభాలు వస్తాయని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఎకరానికి 20 నుంచి 25 క్వింటాళ్ల వరకు దిగుబడి వస్తుందని, పెట్టుబడి తీసేస్తే రూ.2.50 లక్షల వరకు ఆదాయం వస్తు న్నట్టు రైతులు చెబుతున్నారు. జిల్లావ్యాప్తంగా చూస్తే ఈ తెగుళ్ల వల్ల మిర్చి పంట పూర్తిగా దిగుబడి తగ్గిందని, గండేపల్లిలో మాత్రమే పంట ఎక్కువగా ఉందని రైతులు చెబుతున్నారు. దీంతో వ్యాపారులు పంట కొనుగోలు చేసేందుకు ఎగబడుతున్నారని అంటున్నారు. మండలంలోని జెడ్‌.రాగంపేట, యల్లమిల్లి, సూరంపాలెం, నాయకంప ల్లి, రామేశ్వరం పేట తదితర ప్రాంతాల్లో సుమారు 390 ఎకరాల్లో పంట సాగైంది.

ఎండు మిర్చి ధర బాగుంది

గడిచిన రెండేళ్ల నుంచి చూస్తే ఈ ఏడాది ఎండుమిర్చి ధర బాగుంది. పెట్టుబడిపోను ఎకరానికి రూ.2 లక్షల వరకు ఆదాయం వస్తోంది. ఇదే ధర నిలబడితే రైతులు అధిక లాభా లు పొందుతారు. మిర్చిని కొనుగోలు చేసేందుకు వ్యాపారు లు కూడా పెద్ద సంఖ్యలో వస్తున్నారు.

- ఉండవిల్లి చందు, రైతు, పి.నాయకంపల్లి

Updated Date - 2023-01-18T01:19:55+05:30 IST