ఘనంగా మన్యం కొండ జాతర

ABN , First Publish Date - 2023-02-28T00:03:58+05:30 IST

చింతూరు మండలం మోతుగూడెం వద్ద రెండేళ్లకు ఒకసారి ఒడిసా, ఆంధ్ర ప్రజలు ఉమ్మడిగా జరుపుకునే మన్యం జాతర పండుగను సోమవారం ఘనంగా నిర్వహించారు. మల్కాన్‌గిరిలో కొలువై ఉన్న గిరిజన వన దేవత ముత్యాలమ్మ తల్లి, ఆమె సోదరులు కన్నమరాజు, బాలరాజు, పోతురాజు కూడా ప్రత్యేక పూజలు అందుకుంటారు.

 ఘనంగా మన్యం కొండ జాతర

మోతుగూడెం, ఫిబ్రవరి 27: చింతూరు మండలం మోతుగూడెం వద్ద రెండేళ్లకు ఒకసారి ఒడిసా, ఆంధ్ర ప్రజలు ఉమ్మడిగా జరుపుకునే మన్యం జాతర పండుగను సోమవారం ఘనంగా నిర్వహించారు. మల్కాన్‌గిరిలో కొలువై ఉన్న గిరిజన వన దేవత ముత్యాలమ్మ తల్లి, ఆమె సోదరులు కన్నమరాజు, బాలరాజు, పోతురాజు కూడా ప్రత్యేక పూజలు అందుకుంటారు. సోమవారం అమ్మవారు ఘటం ధ్వజరూపంలో ఉన్న ఆమె సోదరులతో కలిసి ఒడిసా నుంచి వేలాది మంది గిరిజనుల నృత్యాలు, మేళతాళాలతో మోతుగూడెం పరిధిలోని ఉన్న పొల్లూరు గ్రామంలో ఏర్పాటు చేసిన అమ్మవారు గద్దెల వద్దకు తరలివచ్చారు. ఏఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి, ఏపీ జెన్కో ఎస్‌ఈ వెంకటేశ్వరరావు, డీఈ భీమవరపు బాలకృష్ణ, సివిల్‌ ఈఈ బాబూరావు, ఎస్‌ఏఓ వీరవల్లి ప్రసాద్‌, సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌ అప్పలనాయుడు, సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ వాసంశెట్టి సత్తిబాబు అమ్మవారికి కొబ్బరికాయలు కొట్టి పట్టువస్త్రాలు సమర్పించారు. అర్చకులు కుమారస్వామి శర్మ ప్రత్యేక పూజలు చేశారు. తర్వాత ఊరేగింపుగా పొల్లూరు జలపాతం వద్దకు అమ్మవారిని తీసుకుని వెళ్లి అక్కడ గుహలో ప్రత్యేక పూజలు చేసి అమ్మవారికి మంగళస్నానం చేయించి పాత ధ్వజాలను నిర్వీర్యం చేసి కొత్త ధ్వజాలతో తిరిగి ఊరేగింపుగా సాయంత్రం సీలేరు నది దాటి ఒడిసాకు ఊరేగింపుగా తీసుకువెళ్లారు. ఒడిసా ప్రజలతో పాటు మన్యం ప్రాంతం నుంచి అధికంగా భక్తులు తరలిరావడంతో పొల్లూరులో వీధులన్నీ నిండిపోయాయి. సుమారు 30 వేల మంది భక్తులు తరలివచ్చినట్లు అంచనా వేశారు.

Updated Date - 2023-02-28T00:03:58+05:30 IST