ప్రియుడితో కలిసి భర్త హత్య
ABN , First Publish Date - 2023-09-21T23:32:32+05:30 IST
వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నాడని భర్తను ప్రియుడితో సాయంతో హత్య చేసింది ఓ మహిళ.. నిందితులైన భార్యను, ఆమె ప్రియుడిని గురువారం అరెస్టు చేసినట్టు పి.గన్నవరం సీఐ ప్రశాంత్‌కుమార్, నగరం ఎస్‌ఐ పి.సురేష్ తెలిపారు.
మామిడికుదురు, సెప్టెంబరు 21: వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నాడని భర్తను ప్రియుడితో సాయంతో హత్య చేసింది ఓ మహిళ.. నిందితులైన భార్యను, ఆమె ప్రియుడిని గురువారం అరెస్టు చేసినట్టు పి.గన్నవరం సీఐ ప్రశాంత్‌కుమార్, నగరం ఎస్‌ఐ పి.సురేష్ తెలిపారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా మామిడికుదురు మండలం పాశర్లపూడి పల్లవపాలానికి చెందిన కొల్లు సాయికుమార్ ఐదేళ్ల క్రితం రాజేశ్వరిని ప్రేమ వివాహం చేసుకున్నాడు. ఇంటి సీలింగ్ పనులు నిర్వహిస్తూ జీవనం సాగించే వారికి ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. ఈ క్రమంలో అదే గ్రామానికి చెందిన కొల్లు వెంకటేష్‌తో సాయికుమార్ భార్య వివాహేతర సంబంధం పెట్టుకుంది. దంపతులు తరచూ గొడవపడేవారు. తమకు అడ్డుగా ఉన్న సాయికుమార్‌ను తొలగించుకోవాలని భావించి రాజేశ్వరి ఈ నెల 17వ తేదీ రాత్రి భర్త పీక పట్టుకోగా ఆమె ప్రియుడు కాళ్లు పట్టుకుని సహకరించాడు. దీంతో సాయికుమార్ మృతి చెందినట్టు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. సాయికుమార్ తండ్రి కొల్లు వీరపండు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో దర్యాప్తు చేసి గురువారం నిందితులను అరెస్టు చేసి రాజోలు కోర్టులో హాజరుపరిచారు.