Share News

లారీ ఢీకొని వ్యక్తి మృతి

ABN , First Publish Date - 2023-11-20T00:18:47+05:30 IST

బలభద్రపురం శివారు కాపవరం రోడ్డుపై ఆగివున్న లారీని ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందాడు. ఎస్‌ఐ పి.బుజ్జిబాబు వివరాల ప్రకారం.. రంగంపేట మండలం ముకుందవరం గ్రామానికి చెందిన షేక్‌ మౌలాలి(42) కొమరిపాలెంలోని రైసుమిల్లులో బస్తాలు మోసే పని చేస్తుంటాడు.

లారీ ఢీకొని వ్యక్తి మృతి

బిక్కవోలు, నవంబరు 19: బలభద్రపురం శివారు కాపవరం రోడ్డుపై ఆగివున్న లారీని ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందాడు. ఎస్‌ఐ పి.బుజ్జిబాబు వివరాల ప్రకారం.. రంగంపేట మండలం ముకుందవరం గ్రామానికి చెందిన షేక్‌ మౌలాలి(42) కొమరిపాలెంలోని రైసుమిల్లులో బస్తాలు మోసే పని చేస్తుంటాడు. పని ముగించుకుని బైక్‌పై శనివారం రాత్రి ఇంటికి వెళ్తుండగా కాపవరం రైస్‌మిల్లు గొడౌన్ల వద్ద రోడ్డు మార్జిన్‌ దిగకుండా, ఎటువంటి సైన్‌ బోర్డులు లేకుండా నిర్లక్ష్యంగా రోడ్డుపై నిలిపి ఉంచిన లారీని ఢీకొన్నాడు. దీంతో మౌలాలి తలకు తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. అతని తమ్ముడి ఫిర్యాదు మేరకు లారీ డైవర్‌పై కేసు నమోదు చేసినట్టు ఎస్‌ఐ తెలిపారు.

Updated Date - 2023-11-20T00:18:48+05:30 IST